జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొత్త కలెక్టరేట్‌లోని సభాభవనంలో క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని హైటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఖాదర్‌బాషా తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొత్త కలెక్టరేట్‌లోని సభాభవనంలో క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని హైటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఖాదర్‌బాషా తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులు, పాస్టర్‌లు, చర్చి పెద్దలు తదితరులు హాజరు కావాలని కోరారు.
15లోగా వివరాలు పంపాలి
జిల్లాలో పదవ తరగతిలో అగ్ర స్థానంలో ఉత్తీర్ణులైన ముగ్గురు క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులు, ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ల పేర్లను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయానికి ఈనెల 15వ తేదీలోపు పంపాలని జిల్లా మైనార్టీ అధికారి ఖాదర్‌బాషా కోరారు. హైటీ ప్రోగ్రాంలో వీరికి బహుమతులను ప్రదానం చేస్తామన్నారు.