చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం కలకలం రేగింది.
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం కలకలం రేగింది. కలెక్టరేట్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు గమనించి అతనిని అడ్డుకున్నారు. దాంతో ప్రాణాపాయం తప్పింది. తన భూమిని తనకు కాకుండా చేశారని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఆరోపిస్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని, అందుకే ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపాడు.