హామీలు అమలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి
Published Sun, Sep 18 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
ఏలూరు (సెంట్రల్) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై అక్టోబర్ 2 నాటికి స్పష్టత ఇవ్వకపోతే పోరుబాట పడతామని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మానస్ మాలిక్ అన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం నాయకులతో సమావేశం నిర్వహించారు. హామీల అమలు చేయాని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అనంతరం మానస్ మాలిక్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రైతు, డ్రాక్వా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానని తప్పుడు హామీలు ఇచ్చి సీఎం అయ్యారని, అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడిచినా వాటిని అమలును గాలికి వదిలేశారని విమర్శించారు. అక్టోబర్ 3న 13 జిల్లాలోని కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిం సీతారామ్, నాయకులు సవరం రోహిత్, రాజనాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షు పదవిని జిల్లాకు చెందిన అక్కిం సీతారామ్‌కు ఇవ్వాలని మానస్ మాలిక్‌ను స్థానిక నాయకులు కోరారు.
Advertisement