Malik
-
ఆహాలో ఫహద్ ఫాజిల్ కొత్త మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఫహద్ ఫాజిల్.. మలయాళ సినిమాలు ఇష్టపడే వారికి ఈ పేరు బాగా సుపరిచితమే. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడీ హీరో. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మాలిక్. కరోనా కారణంగా గతేడాది ఓటీటీలో రిలీజై విశేషాదరణ పొందింది మాలిక్. ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మాలిక్‌ను తెలుగులో అందుబాటులోకి తీసుకువస్తోంది.ఇప్పటికే సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 12 నుంచి ఆహాలో అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో నిమిష సజయన్, వినయ్ ఫోర్ట్, జలజ, జోజు జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రన్స్, సలీమ్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. సజు వర్గీస్ సినిమాటోగ్రఫీ అందించాడు. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. For their rights, for their lives, here's MALIK✊🏻#MalikOnAHA premieres August 12 ▶️ https://t.co/ZROeVwoXvP#FahadhFaasil @NimishaSajayan @C_I_N_E_M_A_A @ActorIndrans #AntoJosephFilmCompany pic.twitter.com/kcdGTCCgAQ — ahavideoin (@ahavideoIN) July 28, 2022 చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సామ్ భారీ బడ్జెట్, అత్యంత ఘోరమైన ఫ్లాప్.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు -
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్‌తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్‌కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్‌లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్‌ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్‌కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్‌ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
IND Vs PAK:సోషల్ మీడియా కు దూరంగా సానియా
-
NIA అధికారులనే బురుడీ కొట్టించిన మాలిక్ బ్రదర్స్
-
Malik Movie Review: ఫహద్ ఫాజిల్ ‘మాలిక్’ రివ్యూ
వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణ నటనతో సౌత్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ‘పుష్ప’, ‘విక్రమ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. గతేడాది ఆయన నటించిన మలయాళ చిత్రం ‘మాలిక్’ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టైటిల్: మాలిక్ కాస్టింగ్: ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్రట్, జోజూ జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రాన్స్, పార్వతి కృష్ణ, సనల్ అమన్ తదితరులు నిర్మాణ సంస్థ: యాంట్స్ టూ ఎలిఫంట్స్స్ సినిమాస్ కో నిర్మాతలు: అనీల్ కె రెడ్డి, కిషోర్ రెడ్డి సమర్పణ: మొజ్విత్,నినిన్ డైరెక్టర్: మహేష్ నారాయణన్ సంగీతం : సుశిన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ: సను వర్గీస్ ఓటీటీ: ఆహా(ఆగస్ట్12, 2022) కథ కేరళ తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి. బంధువుల కోలాహలం నడుమ హజ్ యాత్రకు బయలుదేరుతాడు సులైమాన్ అలీ అహమ్మద్ అలియాస్ మాలిక్ అలియాస్ అలీ ఇక్కా(ఫహద్ ఫాజిల్). అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే ఆ పెద్దాయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. గతంలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాల కింద కేసులు నమోదు చేసి అతన్ని జైళ్లో పెడతారు. అనూహ్యంగా మాలిక్ తల్లి జలజ అప్రూవర్‌గా మారిపోయి వ్యతిరేకంగా సాక్క్ష్యం చెప్పేందుకు ముందుకొస్తుంది. మరోవైపు భార్య రోస్లిన్ మాత్రం ఆయన్ని ఎలాగైనా బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ లోపు మాలిక్ గతం తెర మీదకు కదలాడుతుంది. దశాబ్దాలపాటు పోలీసులు.. రాజకీయ నేతల కుట్రల నుంచి తన నేలను, ప్రజలను కాపాడుకుంటూ ఉద్యమనేతగా ఎదిగిన మాలిక్, ‘బడా డాన్‌గా, మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్’గా ఎందుకు జైలుపాలు కావాల్సి వస్తుంది? సొంతవాళ్లే అతన్ని వెన్నుపోటు పొడిచేంత నేరం మాలిక్ ఏం చేస్తాడు? రాజకీయ కుట్రల నడుమ మాలిక్ కథ ఎలా ముగుస్తుందనేది చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. ‘టేకాఫ్, సీయూ సూన్’ తర్వాత ఫహద్-మహేష్ నారాయణన్ కాంబోలో వచ్చిన మూవీ ఇది. ‘గాడ్ ఫాదర్, నాయకన్(నాయకుడు), అభిమన్యు(1991 మలయాళం), వన్స్ అపాన్ ఎ టైం ఇన్ అమెరికా’.. ఇలా టైంలైన్ కథల తరహాలో సాగే డాన్ కమ్ పొలిటికల్ థ్రిల్లర్ కథల తరహాలోనే ‘మాలిక్’ ఉంటుంది. కానీ, ‘రెలిజియన్ టచ్’ ఇచ్చి ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మహేష్. భూముల ఆక్రమణలు-దాడులు, బతుకు దెరువు కోసం అక్రమ వ్యాపారాలు.. ఇలా కొన్ని వాస్తవ ఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. నలభై మూడు నిమిషాల తర్వాత మొదలయ్యే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కథను జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టించాడు. పవర్ఫుల్ పాత్రలు- వాటి మధ్య పేలే డైలాగులు, సెంటిమెంట్, పొలిటికల్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే మధ్య కథలో కొంచెం సాగదీత, అక్కడక్కడా కొన్ని సీన్ల కట్టింగ్‌తో కొంత గందరగోళంగా అనిపించినప్పటికీ.. పవర్ఫుల్ స్టోరీ ముందు ఆ మైనస్‌లు తేలిపోయాయి. నటనపరంగా.. ఫహద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏజ్ వైజ్ క్యారెక్టర్లలో వేరియేషన్‌తో రఫ్ఫాడించేశాడు. ఆయా పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం చూస్తే.. ఫహద్ ఆ క్యారెక్టర్ కోసం పడ్డ కష్టం ఏంటో కనిపిస్తుంది. అప్పటిదాకా అగ్రెసివ్ క్యారెక్టర్‌గా కనిపించి.. కొడుకు ప్రాణం పోయాక శవాన్ని పట్టుకుని విలపించే సీన్ హైలైట్‌గా అనిపిస్తుంది. అటుపై జైళ్లో ఉన్నప్పుడు మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో కట్టిపడేస్తాడు. రోజ్లిన్గా నిమిషా.. ఫహద్‌తో పోటీ నటన కనబర్చింది. ఒకరకంగా సినిమాకు మాలిక్-రోజ్లిన్లు మెయిన్ పిల్లర్లుగా నిలిచారు. ఇక మాలిక్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్లో వినయ్ నటన మెప్పిస్తుంది. కెరీర్లో ఎక్కువగా కామెడీ వేషాలే వేసిన వినయ్.. డేవిడ్ పాత్రలో ఛాలెంజిగ్ రోల్‌తో అలరించాడనే చెప్పొచ్చు. వీళ్ల తర్వాత మేనల్లుడు ఫ్రెడ్డీ క్యారెక్టర్లో సనల్ అమన్, డాక్టర్ షెర్మిన్గా పార్వతీ కృష్ణన్లు మెప్పించారు. కలెక్టర్‌గా జోజూ జార్జ్ హుందా పాత్రలో అలరించాడు. మాలిక్ తల్లిగా జమీల, మాలిక్ గురువుగా సలీం కుమార్, పార్టీ నేతగా దిలీష్పోతన్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. టెక్నికల్‌గా.. మాలిక్లో దర్శకుడి స్టోరీ టెల్లింగ్‌తో పాటు టెక్నికల్ బ్రిలియన్స్ కూడా కనిపిస్తుంది. 60వ దశకం నుంచి 2000 వరకు టైం లైన్‌గా మాలిక్ కథ సాగుతుంది. గతంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామాల స్ఫూర్తితో ఈ కథను తీసినప్పటికీ.. ప్రత్యేకించి కొన్ని పాయింట్లను తెరపై చూపించడం మాత్రం ఆకట్టుకుంటుంది. సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గ మూడ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యిది. సుషిన్ శ్యామ్ సంగీతం ‘తీరమే’లాంటి సాంగ్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనూ మెప్పించాడు. మేకప్..కాస్టూమ్స్ కథకు తగ్గట్లు బాగున్నాయి. కథ, దర్శకత్వం బాధ్యతతో పాటు తన కథను తానే ఎడిటింగ్ చేసుకుని ‘మాలిక్’ను మరింత పక్కాగా చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు మహేష్ నారాయణన్. వెరసి.. మాలిక్‌ను తప్పకచూడాల్సిన ఓ పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా తీర్చిదిద్దాడు. -
అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్‌ని
హైదరాబాద్ సిటీతో నాకు చాలా అనుబంధం ఉంది..సిటీకి నెలలో రెండు, మూడు పర్యాయాలు వచ్చి నచ్చినప్రాంతాలకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలియ తిరిగి ముంబయ్‌కు వెళతానంటున్నారు బాలీవుడ్ సింగర్, నటుడు అర్మన్ మాలిక్. స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి హిట్ చిత్రంలోపాట పాడి అలరించారు. పెప్సీ కంపెనీనిర్వహిస్తున్న ‘‘హర్ గ్నూథ్ మెయిన్ స్వాగ్’ ప్రచారం నిమిత్తం ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అర్మన్ మాలిక్ విచ్చేశారు. మ్యాచ్ అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగాముచ్చటించారు. ఆ వివరాలు.. ఆయన మాటల్లోనే... ♦ అమితాబ్‌ని మెప్పించా చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. సింగర్ అవ్వాలని కలలు కనేవాడ్ని. పదో ఏట నుంచి గిటార్ నేర్చుకోవడం ప్రారంభించాను. ప్రతి సినిమాను చూస్తూ, సినిమాల్లో వచ్చే పాటలను, సింగర్లను ఫాలో అవుతుండేవాడ్ని. స్కూలు, కాలేజీలో నచ్చిన పాటలు పాడుతూ నా ఫ్రెండ్స్‌ని, టీచర్స్‌ను మెప్పించాను. 2008 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘భూత్నాథ్’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ‘మేరేబడ్డీ’ పాట పాడివినిపించాను. ఓకే అన్నాక సినిమాకు పాడాను. ఆ పాట విన్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ నన్ను మెచ్చుకుని కీప్ ఇట్ అప్ అంటూ మెచ్చుకున్నారు. ♦ సూపర్ హిట్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా 2014లో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీఫెలో’ సినిమాతో పరిచయం అయ్యాను. ‘ఏదో నువ్వన్న’ అనే రొమాంటిక్ సాంగ్‌ని పాడే అవాకాశం వచ్చింది. 2016 ‘ఎంఎస్ ధోనీ’ సినిమాలో తెలుగు, తమిళంలో కలిపి మూడు సాంగ్స్ నేనే పాడాను. ‘కాటమరాయుడు’ సినిమాలో ‘ఏమో..ఏమో..’ సాంగ్, అఖిల్ సినిమా ‘హలో’లో ‘హలో ఎక్కడున్నావ్’ టైటిల్సాంగ్, ‘అరవింద సమేత’లో ‘అనగనగ’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో ‘బ్యూటిఫుల్ లవ్’, ఏక్తాలో ‘ఇదివరకెప్పుడు’, పడిపడిలేచే మనసు సినిమాలో ‘పడి పడిలేచే మనసు’, మిస్ట్టర్ మజ్నులో ‘కోపంగా..కోపంగా’.. పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా.. ♦ చార్మినార్, ట్యాంక్‌బండ్ అంటే ఇష్టం మా అమ్మమ్మ, తాతయ్యలు, బంధువులు అంతా సిటీలోనే స్థిరపడ్డారు. వారిని చూసేందుకు ఇక్కడకు వస్తుంటా. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్‌తో కలసి సిటీలో నైట్ రైడ్ చేస్తుంటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకుంటా. ట్యాంక్‌బండ్, చార్మినార్లు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు తిరిగిన రోడ్లే కదా..ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలసి తిరుగుతుంటే మస్త్ మజా వస్తుంది. ♦ గోంగూరుకు ఫేవరేట్ని నాకు తెలుగు వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ‘గోంగూర పచ్చి రొయ్యలు, గోంగూర రోటి పచ్చడి, గోంగూర పచ్చడి’కి నేను ఫేవరెట్‌ని. వీటితో పాటు హైదరాబాద్ బిర్యానీకి చిన్నప్పటి నుంచే ఫ్యాన్నే. ♦ బన్నీ సినిమాలు చూస్తా నాకు హీరో అల్లుఅర్జున్(బన్నీ) అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు తరచూ చూస్తుంటా. ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాకు పాట పాడేటప్పుడు ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. ఆయన సిగ్నేచర్ అంటే నాకు పిచ్చి. తెలుగులో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. చాలా మంది నా సినిమాలో పాడు అని అడుగుతున్నారు. నేను ఎక్కువగా థమన్‌ని ఫాలో అవుతుంటాను. అందుకే ‘అరవింద సమేత’ సినిమాలో పాటపాడగలిగా. -
ఫ్యూచర్ ప్లాన్
‘‘ఈ గది 10్ఠ 8 ఉండాలి’’ అంది శ్రీమతి మాలిక్ వాళ్ల ముందరి టేబుల్ మీదున్న ఇంటి ప్లానును చూపిస్తూ. ఆమె అలా సూచించడం అది మూడోసారి. దానిని ఆమె భర్తగాని, ఇంటి డిజైన్ తయారుచేసే వ్యక్తిగాని గుర్తించినట్లు లేదు. మాలిక్ దంపతులు ఢిల్లీలో సొంతిల్లు కట్టుకోబోతున్నారు. ఇల్లు కట్టడం పూర్తయితే, తన భర్త వేరే చోటికి బదిలీ అయినా తాను మాత్రం సొంత ఇంట్లోనే ఉండాలని శ్రీమతి మాలిక్ మనస్సులో నిశ్చయించుకొంది. భర్త ఉద్యోగంలో బదిలీ మీద తిరిగి తిరిగి ఆమె అలసిపోయింది. ఇప్పుడు పిల్లలు పెరిగి వస్తున్నారు. వాళ్లను ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మారుస్తూ పోవడం ఇంక మంచిది కాదు. ఆమె పిల్లలతో ఢిల్లీలోనే స్థిరపడుతుంది. వాళ్లత్త ఆమెకు తోడు ఉంటుంది. మాలిక్‌కు కూడా ఇందులో అభ్యంతరం లేదు. ‘‘ఈ గది 10 8 అయ్యుండాలి’’ ఆమె మళ్లీ అంది. ఆమె భర్త పక్క గదిలో ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతున్నాడు. ‘‘కాని ఇది స్టోర్’’ వాస్తు శిల్పి ఆమెకు వివరించాడు. ‘‘అవును, అయితే దానిని మా అత్త ఉన్నన్నాళ్లు ఆమెకిచ్చి, ఆ తర్వాత స్టోర్‌రూమ్‌గా వాడుకోవచ్చనుకున్నాను’’. వాస్తు శిల్పికి అర్థమైనట్లు లేదు. శ్రీమతి మాలిక్ మాటలు విని అతను అయోమయంగా చూశాడు. ‘‘నా ఉద్దేశం మా అత్త ఆ గదిని వాడుకుంటుంది... మీకు తెలుసుగదా ఆమె ముసలావిడ... ఎక్కువకాలం ఉండదు. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్‌రూమ్‌గా మార్చుకోవచ్చు’’. మాలిక్ వచ్చి వాళ్లతో చేరాడు. అతను ఫోన్లో మాట్లాడుతూనే తన భార్య సూచనను గురించి కూడా ఆలోచించినట్లున్నాడు. అతను కూడా స్టోర్ కొంచెం పెద్దదిగానే ఉండాలన్న అభిప్రాయంలో ఉన్నాడు. స్టోర్ రూమ్ ఎప్పుడూ పెద్దదిగా ఉంటే పెట్టెల మధ్య ఫ్రీగా తిరగడానికి వీలవుతుంది. వంటగది పక్కగదిని 10 ్ఠ 8 కొలతల్లో కట్టాలని నిర్ణయించబడింది. మండువా కొంత ఇరుగ్గా ఉంటుంది. అది పెద్ద సమస్య కాదు. మిగతా పనంతా పూర్తయింది. ప్లాను ఆమోదం కోసం కార్పొరేషన్‌కు పంపించారు. శ్రీమతి మాలిక్ ఇంటి నిర్మాణం మీద శ్రద్ధగా పనిచేసింది. రోజంతా గొడుగు వేసుకొని నిలబడి పని చేయించింది. అవసరమైనప్పుడు మేస్త్రీలకు చేతి సహాయం కూడా చేసింది. ఇల్లు కట్టినన్ని రోజులూ అక్కడికి మొట్టమొదట వచ్చేది ఆమే, చిట్టచివర వెళ్లేది ఆమే. తొందరగానే ఇల్లు పూర్తయింది. ఇంటికి కొత్త ఫర్నిచర్ తేవాలని పట్టుబట్టింది. పాత ఫర్నిచర్లో ఒక ముక్కను కూడా కొత్తింట్లోకి తీసుకు రాకూడదనుకొంది. కొత్తింట్లోకి ఎప్పుడు మారాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతలో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొందని తెలిసింది. శ్రీమతి మాలిక్‌కు చాలా కోపం వచ్చింది. ఇంటి కట్టడాన్ని పర్యవేక్షిస్తున్నప్పుడే ఇంటికి సంబంధించి అనేక పథకాలను రూపొందించింది. అన్ని మరిచిపోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్లకు ఢిల్లీ నుంచి బదిలీ అయ్యింది. శ్రీమతి మాలిక్ చాలా సంతోషించింది. ఈ యింట్లో ఉండలేక పోయినందుకు బాధపడనక్కరలేదు. ప్రభుత్వమే వాళ్ల యింటిని అద్దెకు తీసుకోవడంతో ఒక రకంగా వాళ్లు అదృష్టవంతులే. ప్రైవేటు వ్యక్తులతో తలనొప్పి. పైగా బాడుగ సక్రమంగా ఇవ్వరు. ప్రభుత్వం నెలనెలా బాడుగను వాళ్ల బ్యాంక్ అకౌంటుకు జమ చేస్తుంది. ఒక చోటి నుండి మరొక చోటికి బదిలీ అవుతూ ఢిల్లీకి పోస్టింగ్ రావడానికి మాత్రం చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె అత్త చనిపోయింది. వాళ్ల అమ్మాయికి పెళ్లయిపోయింది. వాళ్ల అబ్బాయి మాత్రమే పెళ్లికాకుండా మిగిలి ఉన్నాడు. మాలిక్ రిటైర్ అయ్యేలోపల ఆ పనికూడా చేసేయ్యొచ్చనుకున్నారు. వాళ్లబ్బాయికి పెళ్లయింది, మాలిక్ రిటైర్ అయ్యాడు. ప్రభుత్వం మాత్రం ఇంటిని ఖాళీ చెయ్యలేదు. మాలిక్, అతని భార్య కొడుకు కోడలుతో కలిసి బాడుగ ఇంట్లో ఉన్నారు. మాలిక్ ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడు. తాము కట్టించుకున్న ఇంట్లో ఒక్కరోజు కూడా కాపురం చెయ్యకుండానే మాలిక్ మరణించాడు. మూడు నెలల్లో ఇల్లు ఖాళీ అయ్యింది. శ్రీమతి మాలిక్ కన్నా ఆమె కోడలు సొంతింట్లోకి వెళ్లడానికి ఉత్సాహపడుతున్నది. ఇల్లు స్వాధీనం కాగానే, ఇంటికి రంగులు వేయించి, ఇంట్లోకి మారడం ప్రారంభించింది. ఫర్నిచర్ డీలర్‌ని పిలిచి అతని దగ్గర ఉన్న ప్రతి వస్తువూ పంపమని చెప్పింది. సోమవారం ఉదయం ఇంట్లోకి మారవలసి ఉండింది. మంచిరోజు గనుక ఆరోజే ఇంట్లోకి మారితే బాగుండునని శ్రీమతి మాలిక్ ఆశ. మంగళవారం అమంగళం. ఆరోజు ఇల్లు మారాలని అనుకోనుకూడా అనుకోరాదు. అమ్మ మనసు తెలిసి, కొడుకు వాన కురుస్తున్నా ఇల్లు మారాలని నిర్ణయించుకున్నాడు. సొంతకారుతో బాటు ఒక టాక్సీని రప్పించి, ఇంట్లోకి మారినట్లు మారారు. లగేజి ఇంకా మార్చవలసి ఉంది.వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. కార్లో వెనక సీట్లో కూర్చున్న శ్రీమతి మాలిక్ స్మృతుల్లోకి వెళ్లిపోయింది. ఇల్లు కట్టేటప్పుడు తనెంత శ్రమించింది? భోజనం తప్పిపోయిన రోజులున్నాయి. ఇంటిపని చూస్తూ మండుటెండలో మాడుతూ నిల్చుంది! వానలో ముద్దయిన రోజులున్నాయి. వాస్తు శిల్పి ఇల్లంతా కట్టడం పూర్తయితే ఎలా ఉంటుందో రంగుల చిత్రంగా వేసి చూపించాడు. అందులో ఒక అమ్మాయి మార్బుల్ స్తంభానికి ఆనుకొని వీపు చూపిస్తూ వరండాలో నిలబడినట్లుంది. ఎంత అందం! ఆత్మ తృప్తికి సంకేతం. మెరూన్ చీర ధరించింది. శిల్పి తననే చెక్కినట్లు శ్రీమతి మాలిక్ భావించింది. అయితే ఆమె మెరూన్ చీరలెప్పుడూ కట్టలేదు. స్కెచ్‌లోని బొమ్మ ఆమెలాగే పొడవుగా ఉంది. ఆ స్కెచ్‌ను తన కోడలికి చూపించాలనుకొంది. కోడలు ముందు సీట్లో తన భర్త పక్కన కూర్చొని ఉంది. కారుకున్న రియర్‌వ్యూ గ్లాసును తిప్పుకొని పెదవులకు తిరిగి రంగు అద్దుకుంది. సొంత ఇంటికి వెళ్తూ పెదవులకు రంగు వేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఈ కాలపు ఆడపిల్లల వాలకమే ఇంత. ఉన్నట్టుండి వాస్తు శిల్పి దిద్దిన బొమ్మ తన కోడలిది కావచ్చని అనిపించింది ఆమెకు. అదెలా సాధ్యం? ఇంటిప్లాన్ తయారు చేసేటప్పుడు కోడలు రంగంలోనే లేదు. అయితే ఆమె బొమ్మలో లాగే మెరూన్ చీర ధరించింది. అవును, ఇది మెరూన్ కలరే. శ్రీమతి మాలిక్‌కు మెరూన్ కలర్ ఎప్పుడూ ఇష్టం లేదు. వాళ్లు ఇల్లు చేరుకున్నారు. కొడుకు కారును నేరుగా పోర్టికోలోకి పోనిచ్చాడు. కోడలు కారులోంచి ఎగిరి దూకింది. వరండాలో మార్బుల్ స్తంభం దగ్గర నిలబడి ఆనుకొంది. శిల్పి స్కెచ్‌లో వేసినట్లే నిలబడింది. శ్రీమతి మాలిక్‌కు గుండెల్లో కలుక్కుమంది. శిల్పి ఈ అమ్మాయినే అనుకరించాడేమో! టాక్సీలోని లగేజి అంతా ఇంట్లోకి చేరింది. బాడుగ తీసుకొని టాక్సీ డ్రైవర్ వెళ్లిపోయాడు. శ్రీమతి మాలిక్ ఇంకా కారు వెనక సీట్లో కూర్చునే ఉంది. ఆమెకు తాను కిందికి దిగిపోతున్న అనుభూతి కలుగుతోంది. కొడుకు కోడలు ఇంట్లోకి వెళ్లారు. ఒకటొకటిగా లైట్లు వేశారు. అన్ని గదులూ వెలుతురుతో నిండాయి. ఉద్వేగంలో శ్రీమతి మాలిక్‌కు తలుపు తెరవాలని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. హఠాత్తుగా కొడుక్కి తల్లి గుర్తొచ్చింది. పరుగెత్తికెళ్లి కారు తలుపులు తెరిచాడు. ‘నేను ఏమీ తినను, ఆకలిగా లేదు’’ శ్రీమతి మాలిక్ అంది. ‘‘నేను నిద్రపోతాను’’. ‘‘అయితే మీ రూములో పడుకోండి’’ కోడలు 10 ్ఠ 8 కొలతల గదిని చూపిస్తూ అంది. కొడుకు ఆమెను ఆ గదిలోకి పట్టుకుపోయి దించాడు. ఆమెకు బాగా మత్తుగా ఉంది.‘మా అత్త ఆ గదిని వాడుకుంటుంది. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్‌రూమ్‌గా మార్చుకోవచ్చు’. పడక మీద పడుకొన్న శ్రీమతి మాలిక్ చెవుల్లో ఈ మాటలు మార్మోగాయి. ఆమె మాటిమాటికి తల తిప్పుతూంది. ఆమె కేమయ్యింది? భర్త ఎప్పుడో పోయాడు. ఆమె అతణ్ని అనుసరిస్తుంది. అప్పుడు ఆమె కోడలు ‘‘ఇల్లు బాగానే ప్లాన్ చేశారు. స్టోర్ రూమ్ ఒక్కటి లేదు. ఒక పెద్ద స్టోర్ రూమ్ కావాలి’’ అనడం వినిపించింది. శ్రీమతి మాలిక్ ఆ మాటలు వింది. ఆమెకు లోతులకు లోలోతులకు, అగాధమైన బావిలోకి దిగిపోతున్నట్లు అనిపించింది. -
హామీలు అమలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి
ఏలూరు (సెంట్రల్) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై అక్టోబర్ 2 నాటికి స్పష్టత ఇవ్వకపోతే పోరుబాట పడతామని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ మానస్ మాలిక్ అన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం నాయకులతో సమావేశం నిర్వహించారు. హామీల అమలు చేయాని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అనంతరం మానస్ మాలిక్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రైతు, డ్రాక్వా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానని తప్పుడు హామీలు ఇచ్చి సీఎం అయ్యారని, అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడిచినా వాటిని అమలును గాలికి వదిలేశారని విమర్శించారు. అక్టోబర్ 3న 13 జిల్లాలోని కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిం సీతారామ్, నాయకులు సవరం రోహిత్, రాజనాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షు పదవిని జిల్లాకు చెందిన అక్కిం సీతారామ్‌కు ఇవ్వాలని మానస్ మాలిక్‌ను స్థానిక నాయకులు కోరారు. -
ఆ టెర్రర్ దంపతులను పూడ్చిపెట్టారు
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కాల్పులతో మారణహోమం సృష్టించి పోలీసులు కాల్పుల్లో హతులైన ఆ ఇద్దరు ముస్లిం దంపతులను పూడ్చిపెట్టినట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. ఈ మంగళవారం మధ్యాహ్నం వారి మృతదేహాలు పూడ్చేసినట్లు చెప్పారు. ఈ నెల 2 తెల్లవారుజామున సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. ఈ ఘటనలో 21మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని, సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై దాడులు చేస్తుండటంతో ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించింది. అయితే, అదే రోజు పోలీసులు తీవ్రంగా గాలింపులు జరిపిఎదురుకాల్పులు జరపగా వారిద్దరు ప్రాణాలుకోల్పోయారు. అప్పుడు స్వాధీనం చేసుకున్న వారి మృతదేహాలను మంగళవారం బయటకు తీసుకొచ్చి గంటల్లోనే ఎవరికీ సమాచారం అందించకుండా పూడ్చి వేశారు. దీనిపై అధికారులు ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు. -
'ఆ జంటకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి'
సాన్ బెర్నార్డినో: ఊహించిందే నిజమైంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దాడులకు పాల్పడిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఫరూక్, మాలిక్ యువజంటకు ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫరూక్ పలుమార్లు ఇస్లామిక్ తీవ్రవాదులతో సంభాషణలు జరిపినట్లు తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన సమయంలో వందలాది మందిని హతమార్చడానికి సరిపడే మారణాయుధాలు ఫరూక్ వద్ద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దాడుల తర్వాత ప్రాధమికంగా చేపట్టిన విచారణలో ఫరూక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయం స్సష్టంకాలేదు. వారి కుటుంబంతో పరిచయం ఉన్నవారు సైతం వారు దాడులకు పాల్పడ్డారంటే నమ్మలేకుండా ఉన్నారు. గతంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎఫ్‌బీఐ నిఘా పరిధిలో ఫరూక్ దంపతులు లేరని అధికారులు వెల్లడించారు. -
రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడి మృతి
కర్నూలు(వెల్దుర్తి): రైలు ఎక్కుతుండగా జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన వెల్దుర్తి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం జరిగింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన మాలిక్(22) అనే యువకుడు కర్నూలులోని ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
నటి మోనిక వివాహ వేడుక
-
ఇక నటనకు స్వస్తి!
నటి మోనిక వివాహం ఆదివారం చెన్నై నందం బాక్కంలో వ్యాపారవేత్త మాలిక్‌తో జరిగింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మత పెద్దలు పాల్గొన్నారు. ‘శివరామరాజు’లో చెల్లెలి పాత్ర చేసిన మోనికా ఆ తర్వాత తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో కథానాయిక గా చేశారు. ఇక నటనకు స్వస్తి చెప్పనున్నారు.