ఆ టెర్రర్ దంపతులను పూడ్చిపెట్టారు
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కాల్పులతో మారణహోమం సృష్టించి పోలీసులు కాల్పుల్లో హతులైన ఆ ఇద్దరు ముస్లిం దంపతులను పూడ్చిపెట్టినట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. ఈ మంగళవారం మధ్యాహ్నం వారి మృతదేహాలు పూడ్చేసినట్లు చెప్పారు. ఈ నెల 2 తెల్లవారుజామున సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. ఈ ఘటనలో 21మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు తమదే బాధ్యతని, సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై దాడులు చేస్తుండటంతో ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించింది. అయితే, అదే రోజు పోలీసులు తీవ్రంగా గాలింపులు జరిపిఎదురుకాల్పులు జరపగా వారిద్దరు ప్రాణాలుకోల్పోయారు. అప్పుడు స్వాధీనం చేసుకున్న వారి మృతదేహాలను మంగళవారం బయటకు తీసుకొచ్చి గంటల్లోనే ఎవరికీ సమాచారం అందించకుండా పూడ్చి వేశారు. దీనిపై అధికారులు ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు.