దీక్షలో టీఎస్ ఎంఆర్‌పీఎస్ నాయకులు
-
కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ రిలేదీక్ష ప్రారంభం
ముకరంపుర : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట రిలేనిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలను కార్పొరేటర్ ఎడ్ల అశోక్ ప్రారంభించారు. సంఘం జిల్లా ఇన్‌చార్జి బొడ్డు రాములు మాట్లాడుతూ తాము అధికారంలోకొస్తే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తామని బీజేపీ ప్రకటించిందని, ఇప్పుడు తుంగలో తొక్కుతోందని అన్నారు. దళితుల పట్ల బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో నాయకులు కాదాసు థామస్, మేకల లక్ష్మణ్, క్యాదాసి బాస్కర్, లింగంపల్లి బాబు, మంద బాస్కర్, సుంకె సంపత్, భద్రకంటి చంద్రయ్య, తాటిపల్లి బాబు, సముద్రాల రమేశ్, సిరిసిల్ల నర్సయ్య, లక్ష్మణ్ తదితరులున్నారు.