
ఏలూరు కలెక్టరేట్
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద కలకలం రేగింది.
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద కలకలం రేగింది. గౌరీ పట్నానికి చెందిన బి. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు వచ్చాడు.
తన ఇద్దరు కొడుకులు ఆస్తులు కోసం కొడుతూ హింసిస్తున్నారని మనస్థాపానికి గురైన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతనిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.