ఏలూరు (తూర్పు గోదావరి జిల్లా) : ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కలకలం రేగింది. ఏలూరు మండలం వట్లూరు గ్రామానికి చెందిన బేబీ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటీవలే బేబీ తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆదివారం భార్యాభర్తలను స్టేషన్‌కి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా..బాత్‌రూంకు వెళ్లిన బేబీ అకస్మాత్తుగా పురుగుల మందు తాగింది. వెంటనే తేరుకున్న సిబ్బంది ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
పోలీస్‌స్టేషన్‌లో పురుగులమందు తాగిన మహిళ
Published Sun, May 8 2016 7:19 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement