
సాక్షి, విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుకు నిరసనగా మహిళ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అంజనా చౌదరి.. పార్టీలో వేధింపులు తాళలేక బీజేపీ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. మహిళా నాయకురాలిని వేధించిన పార్టీ నాయకుడికి అందలమెక్కించిన పురందేశ్వరి తీరుపై మనస్తాపంతోనే ఈ పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మహిళా నాయకురాలు అంజనా చౌదరి తన మనుసులోని ఆవేదనను బయటకు చెప్పుకుంది. ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పింది. 26వ వార్డు మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో వివాదం జరిగిందని.. అప్పటి నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి తనను టార్గెట్ చేసినట్లు పేర్కొంది. బీజేపీ వర్క్ షాప్ జరిగినపుడు వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చేటప్పుడు వీడియోలు తీసి వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని అప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ప్రశాంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్లకు పదవులు ఇచ్చి, తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీలో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వాపోయారు. తన చావుకు కారణం రాజంపేట బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులతో పాటు నాగోతు రమేష్ నాయుడు, ప్రశాంత్ అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు మహిళ అయినా ఒక మహిళగా తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీరు పెట్టుకున్నారు.
చదవండి: బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment