జగిత్యాల కలెక్టరేట్ వద్ద కేవీపీఎస్ ధర్నా | kvps dharna at jagtial collectarate | Sakshi
Sakshi News home page

జగిత్యాల కలెక్టరేట్ వద్ద కేవీపీఎస్ ధర్నా

Published Wed, Dec 28 2016 12:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కులవివక్ష వ్యతిరేక పోరాటసమితి(కేవీపీఎస్) ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు దిగారు.

జగిత్యాల: కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కులవివక్ష వ్యతిరేక పోరాటసమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు దిగారు. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమి ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాల నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధి హామీ కార్మికులకు పని కల్పించి పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులు చెల్లించి రోజుకు రూ. 300 చెల్లించాలన్నారు. దళితులపై దాడులు అరికట్టాలని, గల్ఫ్ బాధితుల కొరకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక కోసం 2 ఎకరాల భూమి కేటాయించాలని కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ కాయితి శంకర్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement