కదం తొక్కిన అన్నదాతలు
జగిత్యాల కలెక్టరేట్ ఎదుట 4గంటల పాటు ధర్నా
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతులు వివిధ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా షరతుల్లే కుండా రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్, మూతపడిన చక్కర ఫ్యాక్టరీని తెరిపించాలన్న డిమా ండ్లతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా నలు మూలల నుంచి వేలాదిమంది రైతులు తరలిరాగా.. నిజా మాబాద్ రోడ్డులోని మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, పటేల్‌చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు.
దాదాపు 4 గంటల పాటు ఆందో ళన నిర్వహించారు. కథలాపూర్‌కు చెందిన ఒక రైతు సొమ్మ సిల్లి పడిపోవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి న కలెక్టర్ సత్యప్రసాద్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
అనంతరం రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రూణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో రైతు వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్, బందెల మల్లన్న, బద్దం మహేందర్, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment