జగిత్యాల కలెక్టరేట్ ముట్టడి
Published Tue, Mar 21 2017 12:32 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
జగిత్యాల: మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల కలక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ.. బీజేవైఎం కార్యకర్తలు కలక్టరేట్ ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
Advertisement
Advertisement