తల్లిపాల వారోత్సవాలు నిరంతర ప్రక్రియ
Published Thu, Aug 11 2016 11:57 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
హన్మకొండ అర్బన్ : తల్లిపాల వారోత్సవాల పేరుతో వారం పాటు కార్యక్రమాలు అంగన్‌వాడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇది అంగన్‌వాడీ కార్యకర్తలకు నిరంతర ప్రక్రియ అని ఐసీడీఎస్ హన్మకొండ రూరల్ సీడీపీఓ శైలజ అన్నారు. కలెక్టరేట్‌లోని కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన ప్రాజెక్టు సమావేశంలోఆమె మాట్లాడుతూఅంగన్‌వాడీలు నిత్యం లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆహారం తప్పనిసరిగా కేంద్రంలోనే తినే విధం గా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రంలోనే ఆహారం ఇవ్వాలని వారి బంధువులకు ఇచ్చి హాజరు వేసుకోవడం మానుకోవాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ కార్యకర్త ఆయా అందుబాటులో ఉండాలన్నారు. ఇటీవల శాసనసభా కమిటీ జిల్లాకు వచ్చిన సందర్భంగా వీరి పరిశీలనలో పనితీరు బాగున్నట్లు తేలిందని సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. వివిధ సెక్టార్ల సూపర్‌వైజర్లు, ఏసీడీపీఓతో పాటు అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement