కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం | elderly women attempt suicide in eluru | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

Published Mon, Oct 19 2015 2:57 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఓ వృద్దురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వీరవాసరం మండలం కొనికివాడకు చెందిన లక్ష్మీకాంతం(80) అనే వృద్దురాలికి చెందిన ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జాచేశారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం ఆమె కలెక్టరేట్‌కు వచ్చింది. అధికారుల తీరుకు ఆగ్రహించిన ఆమె బ్లేడుతో చేయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారుల తీరుకు విసిగిపోయిన తాను ఆత్మహత్యకు యత్నించానని లక్ష్మీకాంతం చెప్పారు. తనకు పిల్లలు లేరని, ఒంటరిగా జీవిస్తున్నానని, గతంలో ప్రభుత్వం తనకు ఇచ్చిన స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన స్థలాన్ని తనకు ఇప్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement