laxmikantham
-
‘జనవరి 1 నుంచి సంక్రాంతి కానుక’
అనంతపురం అర్బన్ : జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు జనవరి 1వతేదీ నుంచి సంక్రాంతి కానుక పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి తహశీల్దార్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 11.24 లక్షల బీపీఎల్ కార్డులున్నాయన్నారు. ఇప్పటికే క్రిస్మస్ కానుక కింద 22,189 మందికి పంపిణీ జరిగిందన్నారు. సంక్రాంతి కానుక కింద మిగిలిన 11 లక్షల కార్డులకు పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 31లోగా చౌక దుకాణాలకు కానుకలు తప్పక చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. పంపిణీలో అవతవకలకు తావివ్వకుండా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. బాగాలేకపోతే వెనక్కి తీసుకోండి కానుక కింద ఇస్తున్న కందిపప్పు, శనగపçప్పు, బెల్లం, గోధుమ పిండి, నెయ్యి ఇస్తున్నామన్నారు. జిల్లా 11 లక్షల కానుకలకు అదనంగా 10 శాతం కానుకలను ముందస్తుగా నిల్వ చేశామన్నారు. కార్డుదారు పొందిన సరుకుల్లో ఏదైనా వస్తువు నాణ్యతగా లేదని వస్తే డీలర్లు వారిని వెనక్కి పంపకూడదన్నారు. ఆ వస్తువుని తీసుకుని వేరొకటి ఇవ్వాలన్నారు. వాటిని డీలర్లు పౌర సరఫరాల శాఖకు పంపి మార్చుకోవాలని ఆదేశించారు. జనవరి 12లోగా ప్రతి కార్డుదారునికి కానుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
నగదు రహితమే సులభతరం
- జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం - ఎస్బీఐ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ అనంతపురం అర్బన్ : నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సులభతరమే కాకుండా ఎంతో ప్రయోజనకరమని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నగదు రహిత లావాదేవీలపై జిల్లా అధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి నగదు రహిత లావాదేవీల వల్ల ఉపయోగాలను వివరించాలన్నారు. తద్వారా ఒనగూరే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతగా తీసుకుని నగదు రహిత లావాదేవీల నిర్వహణలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్లు (ఆర్బీఓ) పి.వెంకన్న, వై.శేషసాయి ఏటీఎం, డెబిట్, క్రెడిట్‌కార్డు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులకు వివరించారు. మొబైల్ బ్యాంకింగ్‌లో ఎస్బీఐ ఫ్రీడమ్, ఎనీవేర్ బ్యాంకింగ్ విధానాలను తెలియజేశారు. అదే విధంగా పీఓఎస్ యంత్రాలు, ఎస్బీఐ బడ్డి యాప్ గురించి విశదీకరించారు. ఆర్బీఐ మార్గదర్శకాలు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ మలోలా, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘రూ.100 కోట్లు అవసరం’
అనంతపురం అర్బన్ : జిల్లాలో నగదు లావాదేవీల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూ.100 కోట్లు అవసరం ఉందని, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయించామని ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. చిన్న నోట్ల డినామినేషన్ పొందుపరుస్తూ లేఖని ఆర్బీఐకి పంపించాలని ఎల్డీఎం జయశంకర్ని ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అన్ని బ్యాంక్‌ల చీఫ్ మేనేజర్లతో నగదు లావాదేవీలపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ లేదా వీఆర్ఏలతో బృందం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. బృందాలు ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి బ్యాంక్ ఖాతా లేని జాబితాను తయారు చేస్తారన్నారు. ఖాతాలు లేనివారికి అకౌంట్లు చేయించాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. దాదాపు రెండు లక్షల మంది ఉపాధి కూలీలకు బ్యాంక్ ఖాతాలు తెరవాల్సి ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీకి ఫోన్ ద్వారా ఆదేశించారు. పింఛనుదారులకు సంబంధించి 1.50 లక్షలు ఖాతాలు ఇనాక్టివేషన్‌లో ఉన్నాయని, వీటిని యాక్టివేట్ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొబైల్ బ్యాకింగ్ని అన్ని బ్యాంకులు నిర్వహించాలని చెప్పారు. -
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం
– పట్టభద్ర ఓటర్లు 2,24,109, ఉపాధ్యాయ ఓటర్లు 18,386 – డిసెంబర్ 8 వరకు క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ – డిసెంబర్ 30న తుది జాబితా అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్ఓ మల్లీశ్వరిదేవి బుధవారం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె చాంబర్లో విలేకరులకు వెల్లడించారు. వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లు 2,24,109 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 18,386 మంది నమోదయ్యారు. 2,44,354 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగా.. 20,245 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 21,856 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా.. 3,470 తిరస్కరణకు గురయ్యాయి. డబుల్ ఎంట్రీలను, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు లేనివాటిని తిరస్కరించారు. డిసెంబర్ ఎనిమిది వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు తిరస్కరణకు గురై ఉంటే, అలాంటి వారు కూడా మళ్లీ నమోదు చేసుకోవచ్చు. వచ్చిన క్లెయిములను, అభ్యంతరాలను డిసెంబరు 26లోగా పరిష్కరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాల వారీగా పట్టభద్ర ఓటర్ల ముసాయిదా జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం వైఎస్ఆర్ జిల్లా 47,712 20,968 515 69,195 అనంతపురం 55,256 24,356 803 80,415 కర్నూలు 52,292 21,774 433 74,499 మొత్తం 1,55,260 67,098 1,751 2,24,109 ఉపాధ్యాయ ఓటర్ల ముసాయిదా జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం వైఎస్ఆర్ జిల్లా 3,322 1,565 32 4,919 అనంతపురం 4,799 2,447 31 7,277 కర్నూలు 4,025 2,135 30 6,190 మొత్తం 12,146 6,147 93 18,386 -
పీఓఎస్ యంత్రాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం అర్బన్ : పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) స్వైప్ యంత్రాల కోసం డీలర్లు, వర్తకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో సూచించారు. దరఖాస్తులను ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో స్వీకరిస్తారన్నారు. జిల్లాలోని చౌక దుకాణాల డీలర్లు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు యజమానులు ఇలా అన్ని రకాల వర్తకులు, వ్యాపారులు తప్పని సరిగా పీఓఎస్ యంత్రాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా యంత్రాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నెట్టికంటున్ని దర్శించుకున్న జాయింట్ కలెక్టర్
గుంతకల్లు రూరల్ : జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం శనివారం కుటుంబ సమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి ఆలయానికి చేరుకున్న జేసీ దంపతులకు ఆలయ అధికారులతోపాటు, తహసీల్దార్ హరిప్రసాద్ ఇతర రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి ఆలయ విడిది గృహంలో నిద్ర చేసిన జేసీ దంపతులు, శనివారం వేకువ జామున ఆలయంలో స్వామివారికి నిర్వహించే అభిషేకం కార్యక్రమానికి హాజరయ్యారు. అర్చకులు జేసీ కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
ఓటు నమోదు తప్పనిసరి
అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన వారు ఓటును నమోదు చేసుకోవాలని పట్టభద్రులు, ఉపాధ్యాయులకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. ఓటు నమోదుపై గ్రామగ్రామాన విస్తత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 2,400 మంది పట్టభద్రులు, 51 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. నవంబరు 5లోగా అర్హులు ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ అంజయ్య, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఇతర అధికారులు పాల్గొన్నారు. 24లోగా సర్వే పూర్తి చేయాలి ప్రజాసాధికార సర్వే ఈ నెల 24లోగా పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలాలు, మునిసిపాలిటీల్లో సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే అసంఘటిత కార్మికులను గుర్తించి చంద్రన్న బీమా పథకం కింద నమోదు చేయాలన్నారు. డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, సర్వే పర్యవేక్షకుడు భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వేపై జేసీ అసంతృప్తి
అనంతపురం న్యూసిటీ : జిల్లాలో ప్రజాసాధికార సర్వే 50 శాతం మాత్రమే పూర్తి చేయడంపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10లోపు పూర్తిచేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో ఆయన మాట్లాడారు. సర్వేలో తప్పులు సరిచేసిన వారిలో కదిరి మొదటి స్థానంలో, అనంతపురం చివరి స్థానంలో ఉందన్నారు. చంద్రన్న బీమా 87 శాతం పూర్తి అయ్యిందన్నారు. బీమా చేయడంలో ధర్మవరం మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని 126 గ్రా మాలను ఓడీఎఫ్‌గా ప్రకటించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. -
విస్తృత తనిఖీలు నిర్వహించాలి
అనంతపురం అర్బన్ : ఆహార కల్తీ, తూనికల్లో అవినీతి, చౌకదుకాణాల్లో అవకతవకలపై విస్తత తనిఖీలు నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ సమావేశం నిర్వహించారు. అధికారులు నిర్వహించిన తనిఖీలు, నమోదు చేసిన కేసుల వివరాలపై çసమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దష్ట్యా ఆహార పదార్థాల్లో కల్తీపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఆకస్మిక దాడులు చేయాలని చెప్పారు. ప్రధానంగా బేకరీలు, హోటళ్లల్లో ఆహార పదార్థాలను తనిఖీలు చేయాలన్నారు. కలుషితంగా ఉన్నట్టు గుర్తిస్తే తక్షణం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. గత వారం రోజుల వ్యవధిలో ఆహార పదార్థాలకు సంబంధించి 22 నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం లాబొరేటరీకి పంపించామని ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు చెప్పారు. తూనికలు కొలతల శాఖ అధికారులు మాట్లాడుతూ దుకాణాలు, ట్రేడర్లపై దాడులు నిర్వహించి 50 కేసులు నమోదు చేసి రూ.2.74 లక్షలు కాంపౌండ్ ఫీజు వసూలు చేశామన్నారు. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాట్లాడుతూ 211 దుకాణాలపై దాడులు నిర్వహించామని, అందులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 48 దుకాణాలకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ చౌక దుకాణాలు, ట్రేడర్లపై దాడులు నిర్వహించి పది వాటిపై 6ఎ కేసులు నమోదు చేశామన్నారు. అక్రమంగా నిలువ చేసిన 2,076 లీటర్ల కిరోసిన్, 291.37 క్వింటాళ్ల బియ్యం, 40 క్వింటాళ్లు కందులు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలు రూ.10.06 లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో తూనికలు కొలతల అధికారి రవిశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘90 వేల ఎకరాలకు రక్షక తడి’
అనంతపురం అర్బన్: జిల్లాలో వర్షాభావంతో ఎండుతున్న 90 వేల ఎకరాల్లోని వేరుశనగ పంటకు రక్షక నీటి తడులను అందించామని ఇన్చార్జి కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,33,598 ఎకరాల్లో వేరుశనగ బెట్ట పరిస్థతుల్లో ఉందని తెలిపారు. రైతుల బోర్ల నుంచి పక్కనున్న 72,981 ఎకరాలకు, కెనాల్ ద్వారా నీటిని సేకరించి 8,352 ఎకరాలకు రెయిన్గన్ల ద్వారా తడులు ఇచ్చామని వివరించారు. -
కలెక్టరేట్లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఓ వృద్దురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వీరవాసరం మండలం కొనికివాడకు చెందిన లక్ష్మీకాంతం(80) అనే వృద్దురాలికి చెందిన ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జాచేశారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం ఆమె కలెక్టరేట్‌కు వచ్చింది. అధికారుల తీరుకు ఆగ్రహించిన ఆమె బ్లేడుతో చేయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారుల తీరుకు విసిగిపోయిన తాను ఆత్మహత్యకు యత్నించానని లక్ష్మీకాంతం చెప్పారు. తనకు పిల్లలు లేరని, ఒంటరిగా జీవిస్తున్నానని, గతంలో ప్రభుత్వం తనకు ఇచ్చిన స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన స్థలాన్ని తనకు ఇప్పించాలని కోరారు. -
వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నెల్లూరు (కల్టెకరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ శనివారం విడుదల కానుందని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో మొత్తం 48 వీఆర్వో, 145 వీ ఆర్ఏల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. వీఆర్వో పోస్టుకు ఇంట ర్మీడియెట్, తత్సమానమైన విద్యార్హత, వీఆర్ఏలకు 10వ తరగతి విద్యార్హతగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 12వ తేదీ లోగా మీ సేవ, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలని, వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఫిబ్రవరి రెండో తేదీన ఉదయం వీఆర్వో అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్ఏ అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి 36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించారు. వీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 41 ఏళ్ల వయస్సు వరకు అవకాశం ఉందన్నారు. వీఆర్ఏ పోస్టుల విషయంలో 42 ఏళ్లు మించరాదన్నారు. పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేస్తున్నామన్నారు.