నగదు రహితమే సులభతరం | joint collector statment on cash less deposits | Sakshi
Sakshi News home page

నగదు రహితమే సులభతరం

Published Sat, Dec 3 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

నగదు రహితమే సులభతరం

నగదు రహితమే సులభతరం

- జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం
- ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ


అనంతపురం అర్బన్‌ : నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సులభతరమే కాకుండా ఎంతో ప్రయోజనకరమని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం అన్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నగదు రహిత లావాదేవీలపై జిల్లా అధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి నగదు రహిత లావాదేవీల వల్ల ఉపయోగాలను వివరించాలన్నారు. తద్వారా ఒనగూరే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు.

ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతగా తీసుకుని నగదు రహిత లావాదేవీల నిర్వహణలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్లు (ఆర్‌బీఓ) పి.వెంకన్న, వై.శేషసాయి ఏటీఎం, డెబిట్, క్రెడిట్‌కార్డు, ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాకింగ్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అధికారులకు వివరించారు. మొబైల్‌ బ్యాంకింగ్‌లో ఎస్‌బీఐ ఫ్రీడమ్, ఎనీవేర్‌ బ్యాంకింగ్‌ విధానాలను తెలియజేశారు. అదే విధంగా పీఓఎస్‌ యంత్రాలు, ఎస్‌బీఐ బడ్డి యాప్‌ గురించి విశదీకరించారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలు చెప్పారు. సమావేశంలో ఆర్‌డీఓ మలోలా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement