అనంతపురం న్యూసిటీ : జిల్లాలో ప్రజాసాధికార సర్వే 50 శాతం మాత్రమే పూర్తి చేయడంపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10లోపు పూర్తిచేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో ఆయన మాట్లాడారు.
సర్వేలో తప్పులు సరిచేసిన వారిలో కదిరి మొదటి స్థానంలో, అనంతపురం చివరి స్థానంలో ఉందన్నారు. చంద్రన్న బీమా 87 శాతం పూర్తి అయ్యిందన్నారు. బీమా చేయడంలో ధర్మవరం మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని 126 గ్రా మాలను ఓడీఎఫ్‌గా ప్రకటించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
ప్రజాసాధికార సర్వేపై జేసీ అసంతృప్తి
Published Fri, Oct 7 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement