అనంతపురం అర్బన్ : ఆహార కల్తీ, తూనికల్లో అవినీతి, చౌకదుకాణాల్లో అవకతవకలపై విస్తత తనిఖీలు నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సమావేశం నిర్వహించారు. అధికారులు నిర్వహించిన తనిఖీలు, నమోదు చేసిన కేసుల వివరాలపై çసమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దష్ట్యా ఆహార పదార్థాల్లో కల్తీపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఆకస్మిక దాడులు చేయాలని చెప్పారు. ప్రధానంగా బేకరీలు, హోటళ్లల్లో ఆహార పదార్థాలను తనిఖీలు చేయాలన్నారు.
కలుషితంగా ఉన్నట్టు గుర్తిస్తే తక్షణం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. గత వారం రోజుల వ్యవధిలో ఆహార పదార్థాలకు సంబంధించి 22 నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం లాబొరేటరీకి పంపించామని ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు చెప్పారు. తూనికలు కొలతల శాఖ అధికారులు మాట్లాడుతూ దుకాణాలు, ట్రేడర్లపై దాడులు నిర్వహించి 50 కేసులు నమోదు చేసి రూ.2.74 లక్షలు కాంపౌండ్ ఫీజు వసూలు చేశామన్నారు.
ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాట్లాడుతూ 211 దుకాణాలపై దాడులు నిర్వహించామని, అందులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 48 దుకాణాలకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ చౌక దుకాణాలు, ట్రేడర్లపై దాడులు నిర్వహించి పది వాటిపై 6ఎ కేసులు నమోదు చేశామన్నారు. అక్రమంగా నిలువ చేసిన 2,076 లీటర్ల కిరోసిన్, 291.37 క్వింటాళ్ల బియ్యం, 40 క్వింటాళ్లు కందులు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలు రూ.10.06 లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో తూనికలు కొలతల అధికారి రవిశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విస్తృత తనిఖీలు నిర్వహించాలి
Published Sat, Sep 3 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
Advertisement
Advertisement