వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | VRO,VRA post notification | Sakshi
Sakshi News home page

వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Published Sat, Dec 28 2013 4:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

VRO,VRA post notification

నెల్లూరు (కల్టెకరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ శనివారం విడుదల కానుందని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
 
  జిల్లాలో మొత్తం 48 వీఆర్వో, 145 వీ ఆర్‌ఏల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. వీఆర్వో పోస్టుకు ఇంట ర్మీడియెట్, తత్సమానమైన విద్యార్హత, వీఆర్‌ఏలకు 10వ తరగతి విద్యార్హతగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హులైన అభ్యర్థులు  జనవరి 12వ తేదీ లోగా మీ సేవ, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలని, వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఫిబ్రవరి రెండో తేదీన ఉదయం వీఆర్వో అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్‌ఏ అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి 36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించారు.
 
  వీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 41 ఏళ్ల వయస్సు వరకు అవకాశం ఉందన్నారు. వీఆర్‌ఏ పోస్టుల విషయంలో 42 ఏళ్లు మించరాదన్నారు. పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేస్తున్నామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement