ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం | mlc voter list ready | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం

Published Wed, Nov 23 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

mlc voter list ready

– పట్టభద్ర ఓటర్లు 2,24,109, ఉపాధ్యాయ ఓటర్లు 18,386
– డిసెంబర్‌ 8 వరకు క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ
– డిసెంబర్‌ 30న తుది జాబితా


అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి బుధవారం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె చాంబర్‌లో విలేకరులకు వెల్లడించారు. వైఎస్‌ఆర్‌, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లు 2,24,109 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 18,386 మంది నమోదయ్యారు. 2,44,354 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగా.. 20,245 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

21,856 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా.. 3,470 తిరస్కరణకు గురయ్యాయి. డబుల్‌ ఎంట్రీలను, ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు లేనివాటిని తిరస్కరించారు. డిసెంబర్‌ ఎనిమిది వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు తిరస్కరణకు గురై ఉంటే, అలాంటి వారు కూడా మళ్లీ నమోదు చేసుకోవచ్చు. వచ్చిన క్లెయిములను, అభ్యంతరాలను డిసెంబరు 26లోగా పరిష్కరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

జిల్లాల వారీగా పట్టభద్ర ఓటర్ల ముసాయిదా
జిల్లా        పురుషులు    మహిళలు    ఇతరులు        మొత్తం    
వైఎస్‌ఆర్‌ జిల్లా    47,712        20,968        515        69,195    
అనంతపురం    55,256        24,356        803        80,415    
కర్నూలు        52,292        21,774        433        74,499    
మొత్తం        1,55,260    67,098        1,751        2,24,109    

ఉపాధ్యాయ ఓటర్ల ముసాయిదా
జిల్లా        పురుషులు    మహిళలు    ఇతరులు        మొత్తం    
వైఎస్‌ఆర్‌ జిల్లా    3,322        1,565        32        4,919    
అనంతపురం    4,799        2,447        31        7,277    
కర్నూలు        4,025        2,135        30        6,190    
మొత్తం        12,146        6,147        93        18,386   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement