mlc voter
-
ఉపాధ్యాయులూ మేల్కొనండి!
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.నవంబర్ 6 వరకు గడువు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్యఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపా టు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది. నివాసమే ప్రామాణికం..ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు. -
ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదుకు మరో అవకాశం
బద్వేలు/కడప కోటిరెడ్డి సర్కిల్: వచ్చే ఏడాది జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల 23న విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ (కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలు)కు సంబంధించి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఓటర్ నమోదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జాబితాను ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ►పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ మేరకు అర్హులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారితో ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు. జాబితాను పరిశీలించి ఓటర్‌గా నమోదు కాకుంటే మరో పర్యాయం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అదే రోజు నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలతో పాటు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కానీ, కలెక్టరేట్లో ఉన్న సహాయ ఎన్నికల అధికారికి అందజేయాలి. దీనిపై సందేహాలకు 1950 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తీర్చుకోవచ్చు. నమోదు కోసం... గ్రాడ్యుయేట్: వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. 2019 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, బీటెక్, బీఈ వంటి డిగ్రీలు చదివిన వారు అర్హులే. ఇంటర్ తదుపరి మూడు సంవత్సరాల డిప్లొమో చదివిన వారు గ్రాడ్యుయేట్ ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైñన్లో ఫారం–18 ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం చేసుకోవచ్చు ఫొటో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఓటర్‌కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఫారం–18 పూర్తి చేసి, ఫొటో అతికించిన దరఖాస్తుతో డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్(గెజిటెడ్ అటేస్టేషన్ చేయాలి), ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు జెరాక్స్ కాపీలను అందజేయాలి. ఉపాధ్యాయులు: ఫారం–19 పూర్తి చేసి ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు సర్వీస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అందజేయాలి. నవంబర్ 2016 నుంచి అక్టోబర్ 2022 లోపు ఆరేళ్లలో కనీసం మూడేళ్లు సర్వీస్ పూర్తి చేయాలి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఎంఈఓ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేసే అధ్యాపకులకు ప్రిన్సిపల్ సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రయివేట్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ధ్రువీకరించాలి. ప్రయివేట్‌జూనియర్ కళాశాలలో పని చేస్తున్న వారికి ఇంటర్ బోర్డుకు సంబంధించి ఆర్ఐఓ, ఆర్జేడీ ధ్రువీకరించాలి. ప్రయివేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ఉన్నత విద్యాశాఖకు చెందిన ఆర్జేడీ ధ్రువీకరించాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి శ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కుకు సంబంధించి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఈనెల 23 నుంచి డిసెంబరు 9వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శివరామిరెడ్డి, తహసీల్దార్, కడప -
ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా సిద్ధం
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ(అనంతపురం, కర్నూలు, వైఎస్సార్) జిల్లాల పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జబితా సిద్ధమయ్యింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల తుది జాబితాలను ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 23 వరకు వచ్చిన క్లయిమ్‌లు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాను పక్కగా రూపొందించామన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 2,53,515 మంది ఓటర్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 20,644 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పట్టభద్రులు జిల్లా పురుష ఓటర్లు మహిళ ఓటర్లు ఇతరులు మొత్తం వైఎస్సార్ 54,643 24,339 519 79,501 అనంతపురం 61,081 27,402 777 89,260 కర్నూలు 59,410 24,925 419 84,754 ............................................................................................. మొత్తం 1,75,134 76,666 1,715 2,53,515 ఉపాధ్యాయులు జిల్లా పురుష ఓటర్లు మహిళ ఓటర్లు ఇతరులు మొత్తం వైఎస్సార్ 3,949 1,898 30 5,877 అనంతపురం 5,149 2,637 31 7,817 కర్నూలు 4,499 2,424 27 6,950 ............................................................................................. మొత్తం 13,597 6,959 88 20,644 --------------------------------------------------- -
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం
– పట్టభద్ర ఓటర్లు 2,24,109, ఉపాధ్యాయ ఓటర్లు 18,386 – డిసెంబర్ 8 వరకు క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ – డిసెంబర్ 30న తుది జాబితా అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్ఓ మల్లీశ్వరిదేవి బుధవారం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె చాంబర్లో విలేకరులకు వెల్లడించారు. వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లు 2,24,109 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 18,386 మంది నమోదయ్యారు. 2,44,354 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగా.. 20,245 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 21,856 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా.. 3,470 తిరస్కరణకు గురయ్యాయి. డబుల్ ఎంట్రీలను, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు లేనివాటిని తిరస్కరించారు. డిసెంబర్ ఎనిమిది వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు తిరస్కరణకు గురై ఉంటే, అలాంటి వారు కూడా మళ్లీ నమోదు చేసుకోవచ్చు. వచ్చిన క్లెయిములను, అభ్యంతరాలను డిసెంబరు 26లోగా పరిష్కరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాల వారీగా పట్టభద్ర ఓటర్ల ముసాయిదా జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం వైఎస్ఆర్ జిల్లా 47,712 20,968 515 69,195 అనంతపురం 55,256 24,356 803 80,415 కర్నూలు 52,292 21,774 433 74,499 మొత్తం 1,55,260 67,098 1,751 2,24,109 ఉపాధ్యాయ ఓటర్ల ముసాయిదా జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం వైఎస్ఆర్ జిల్లా 3,322 1,565 32 4,919 అనంతపురం 4,799 2,447 31 7,277 కర్నూలు 4,025 2,135 30 6,190 మొత్తం 12,146 6,147 93 18,386