అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన వారు ఓటును నమోదు చేసుకోవాలని పట్టభద్రులు, ఉపాధ్యాయులకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. ఓటు నమోదుపై గ్రామగ్రామాన విస్తత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 2,400 మంది పట్టభద్రులు, 51 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. నవంబరు 5లోగా అర్హులు ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ అంజయ్య, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
24లోగా సర్వే పూర్తి చేయాలి
ప్రజాసాధికార సర్వే ఈ నెల 24లోగా పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలాలు, మునిసిపాలిటీల్లో సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే అసంఘటిత కార్మికులను గుర్తించి చంద్రన్న బీమా పథకం కింద నమోదు చేయాలన్నారు. డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, సర్వే పర్యవేక్షకుడు భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఓటు నమోదు తప్పనిసరి
Published Sat, Oct 15 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement
Advertisement