ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను కొమురం భీమ్‌కాలనీవాసులు గురువారం ముట్టడించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు ది గారు. ఆదిలాబాద్ తహశీల్దార్ దత్తుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఎం రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు లంక రాఘవులు మాట్లాడుతూ పట్టణ శివారులోని కొమురం భీమ్ కాలనీలో నివసిస్తున్న పేదల భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందని, అప్పటి నుంచి అధికారుల తీరులో మార్పు వచ్చిందని విమర్శించారు. కాలనీలోని స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయూలని డిమాండ్ చేశారు. కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారికి పట్టాలివ్వాలన్నారు.
అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేస్తామని గతంలో అధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో పార్టీల నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండడంతోనే అధికారులు చర్యకు వెనుకాడుతున్నారని ఆరోపించారు. కాలనీలో నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాల వారిని భయూందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి పేదలకు పట్టాలు అందించి కరెంట్, నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు చిన్న య్య, కుంటాల రాములు, అశోక్, చంద్రకళ, కమల, పొచ్చక్క, యశోద, కాలనీవాసులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడి
Published Fri, Aug 23 2013 2:54 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement