Komaram Bhim
-
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..
సాక్షి, అదిలాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు మాయ మాటలు చెప్పి.. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్మేసిన ఘటన కోమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది. తిర్యాణి మండలం కొలం తెగకు చెందిన మతిస్థిమితం లేని గిరిజన మహిళను సమీప బంధువుతోపాటు ఓ వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకొని మధ్యప్రదేశ్‌లోని మండ్పుర్ జిల్లాలోని ఓ వ్యక్తికి అమ్మేశారు. కూతురు కనబడటం లేదని మహిళ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో, తన కూతురు ఎక్కడికి వెళ్లలేదని తండ్రిని మభ్యపెట్టారు. మహిళను మధ్యప్రదేశ్‌లో ఇంటి పనులకు వాడుకోవడమే కాకుండా.. శారీరకంగా నరకం చూపించడంతో తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది. డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా అక్రమ రవాణాకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేశామని, నిందుతులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. గిరిజన మహిళలు ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
నీటిని వృథా చేయొద్దు..
► ప్రాణికోటికి నీరు ఎంతో అవసరం ► నీటిని పొదుపుగా వాడుకోండి కొమరంభీమ్ ఆ రోజుల్లోనే చెప్పారు ► కలెక్టర్ జగన్మోహన్ దత్తత గ్రామంలో జలదినోత్సవం ఆదిలాబాద్ రూరల్ : భూగర్భ జలాలు అడుగుంటి పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయవద్దని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. నీటిని వృథా చేయమని, అవసరం ఉన్నంత మేరకే వాడుతామని జిల్లా కలెక్టర్ అంకోలి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మంగళవారం జల దినోత్సవాన్ని పురస్కారించుకొని కలెక్టర్ దత్తత తీసుకున్న అంకోలి గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కొమరం భీం ఆ రోజుల్లోనే నీటి విలువను తెలపడం జరిగిందన్నారు. ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. గ్రామంలో ఎవరూ చదువు చెప్పడం లేదని, ఇలా అయితే తామెలా చదువుకునేదని అంకోలి గ్రామానికి చెందిన వయోజనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ చాకటి భారతి, ఎంపీటీసీ కనక రమణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డ్వామా పీడీ శంకర్, డీఎఫ్‌వో గోపాల్‌రావు, ఎంపీడీవో రవిందర్, ఈవోపీఆర్డీ సుదర్శన్ బానోవత్, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రణాళికబద్ధంగా చదువాలి... అలసత్వాన్ని వీడి ఐక్యతతో ప్రణాళిక బద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించడానికి అస్కారం ఉంటుందని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో స్టార్-30 ఏంసెట్ ఐఐటీ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ మంచి ర్యాంక్ సాధించాలన్నారు. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడడంతోనే గుర్తింపు వస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అగస్టిన్, కోర్సు నోడల్ ఆఫీసర్, కోర్సు కోఆర్డినేటర్ శ్రీనివాస స్వామి, ఏటీడబ్ల్యూవో, సిబ్బంది షరీఫ్ ఉన్నారు. -
తెరపై కొమరం భీమ్
గిరిజనుల హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కొమరం భీమ్’. వైభవ్ సూర్య, స్వప్న ముఖ్యపాత్రల్లో స్వీయదర్శకత్వంలో నాగ బాల సురేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘దూరదర్శన్‌లో కొమరం భీమ్ చరిత్రను 70 ఎపిసోడ్స్ తీశాను. గిరిజన జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన ఈ మహనీయుడి జీవిత చరిత్రకు వెండి తెర రూపం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ సినిమా చేస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించే విధంగా వివాదాలకు దూరంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శక-నిర్మాత సురేశ్ తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: లలిత, శైలేశ్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ: వై.సంపత్ కుమార్. -
ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు...
వేలేరుపాడు, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆదివాసీలంతా కొమరం భీం మాదిరిగా పోరాడాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వేలేరుపాడు మండలంలోని మారుమూలనున్న కొయిదాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటైన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆంధ్రాలోని బడా పారిశ్రామికవేత్తల స్వప్రయోజనాల కోసం ఇక్కడి ఆదివాసీలను ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. విలీనంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకపోవడం వెనుక ఏపీ పెద్దల కుట్ర ఉందన్నారు. ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2వ తేదీన ముంపు మండలాల్లో బ్లాక్ డే జరపనున్నట్టు చెప్పారు. 20 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర కొయిదాలో శనివారం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి 20 కిలోమీటర్ల దూరంలోగల కన్నాయిగుట్టకు చేరింది. ఈ పాదయాత్రకు గిరిజన గ్రామాల్లో విశేష స్పందన లభించింది. మేడేపల్లి నుంచి మరో బృందం ప్రారంభించిన పాదయాత్ర మల్లారం వరకు సాగింది. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కె.గౌస్, గోకినేపల్లి వెంకటేశ్వరావు, సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఎండి.మునీర్, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస గౌడ్, వివిధ పార్టీల నాయకులు కారం దారయ్య, అమరవరపు అశోక్, ఎస్కె.నజీర్, వలపర్ల రాములు, గిల్లా వెంకటేశ్వర్లు, పూరెం లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను కొమురం భీమ్కాలనీవాసులు గురువారం ముట్టడించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు ది గారు. ఆదిలాబాద్ తహశీల్దార్ దత్తుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఎం రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు లంక రాఘవులు మాట్లాడుతూ పట్టణ శివారులోని కొమురం భీమ్ కాలనీలో నివసిస్తున్న పేదల భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందని, అప్పటి నుంచి అధికారుల తీరులో మార్పు వచ్చిందని విమర్శించారు. కాలనీలోని స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయూలని డిమాండ్ చేశారు. కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారికి పట్టాలివ్వాలన్నారు. అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేస్తామని గతంలో అధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో పార్టీల నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండడంతోనే అధికారులు చర్యకు వెనుకాడుతున్నారని ఆరోపించారు. కాలనీలో నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాల వారిని భయూందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి పేదలకు పట్టాలు అందించి కరెంట్, నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు చిన్న య్య, కుంటాల రాములు, అశోక్, చంద్రకళ, కమల, పొచ్చక్క, యశోద, కాలనీవాసులు పాల్గొన్నారు.