తెరపై కొమరం భీమ్ | komaram bhim movie | Sakshi
Sakshi News home page

తెరపై కొమరం భీమ్

Published Thu, Oct 8 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

తెరపై కొమరం భీమ్

తెరపై కొమరం భీమ్

 గిరిజనుల హక్కుల కోసం పోరాడిన  కొమరం భీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కొమరం భీమ్’. వైభవ్ సూర్య, స్వప్న ముఖ్యపాత్రల్లో  స్వీయదర్శకత్వంలో నాగ బాల సురేశ్  నిర్మిస్తున్న   ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘దూరదర్శన్‌లో కొమరం భీమ్ చరిత్రను 70 ఎపిసోడ్స్ తీశాను. గిరిజన జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన ఈ మహనీయుడి జీవిత చరిత్రకు వెండి తెర రూపం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ సినిమా చేస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించే విధంగా వివాదాలకు దూరంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శక-నిర్మాత సురేశ్ తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: లలిత, శైలేశ్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ: వై.సంపత్ కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement