కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review On Contract Employees Welfare In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష

Published Mon, Jul 13 2020 2:59 PM | Last Updated on Mon, Jul 13 2020 5:53 PM

CM YS Jagan Review On Contract Employees Welfare In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్‌ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ మల్లికార్జున్ ఈ‌ సమీక్షలో పాల్గొన్నారు.
(చదవండి: ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా.. ?)

గత ప్రభుత్వం చేసింది సున్నా
వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావుడిగా టీడీపీ ప్రభుత్వం  జారీ చేసిన జీవో అమలు బాధ్యతను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం మోస్తోందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019, జూలై నుంచి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

దీని ఫలితంగా మార్చి 31, 2017 న ఉన్న జీతాలు.. జులై, 2019 నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. జూనియర్‌ లెక్చరర్‌కు రూ.19,050 ఉన్న జీతం 2019 జులై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయింది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మేల్‌) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయ్యింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ.21,230 అయ్యింది. స్కూల్‌ అసిస్టెంట్‌ జీతం రూ. 10,900 నుంచి 95 శాతం పెరిగి జులై , 2019 నాటి నుంచి రూ. 21,230 అయిందని అధికారులు సీఎంకు వివరించారు.
(అందరినోట లాక్‌డౌన్‌ మాట..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement