కో టాలేదు..తలే | power cuts in Nalgonda | Sakshi
Sakshi News home page

కో టాలేదు..తలే

Published Wed, Oct 15 2014 2:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

కో టాలేదు..తలే - Sakshi

కో టాలేదు..తలే

 నీలగిరి : జిల్లా విద్యుత్‌శాఖ పీకల్లోతు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు విద్యుత్ కోతల కారణంగా తలెత్తుతున్న సమస్యలు అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తుంటే...మరోవైపు కొద్ది రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా ఎక్కడి సేవలు అక్కడే స్తంభించిపోయాయి. ఇక ఓవర్‌లోడ్ పుణ్యమాని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది.
 
 అప్రకటిత కోతలు..
 విద్యుత్‌శాఖ అమలు చేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్ని రంగాలపై కోలుకోలేని దెబ్బపడింది. రాష్ట్రంలో విద్యుత్ లోటు కారణంగా జిల్లా కోటా అనేది లేకుండా చేశారు. కోతలు లేని కాలంలో జిల్లాకు నెలవారీ విద్యుత్ కోటాను కేటాయిస్తూ ఆ మేరకు  అన్ని అవసరాలకు విద్యుత్ సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం అప్రకటిత కోతల వల్ల జిల్లా కోటాను పూర్తిగా బంద్ చేశారు. లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచే నేరుగా విద్యుత్ సరఫరా చేస్తూ కోతలు విధిస్తున్నారు. వ్యవసాయ రంగానికి 6 గంటలు కరెంట్ ఇచ్చేందుకుగాను పరిశ్రమలు, గృహావసరాలకు సరఫరా అయ్యే విద్యుత్‌లో కోత విధించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. భువనగిరి డివిజన్ పరిధిలో మాత్రం శని, ఆదివారాలు పవర్ హాలిడే అమలుచేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాల్లో 9 గంటల పాటు కోత విధిస్తున్నారు. వ్యవసాయరంగానికి రా త్రి 3 గంటలు, పగలు 3 గంటలు సరఫరా చేస్తున్నా రు. వాస్తవానికి వ్యవసాయానికి 7 గంటలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక గంట కత్తిరిస్తున్నారు. ఈ విధంగా అ న్ని రంగాలకు కోతలు విధిండచడం వల్ల ఇక జిల్లాకు ప్రత్యేకంగా కోటా అనేది లేకుండా పోయింది.
 
 కాలిపోతున్న ట్రాన్స్‌పార్మర్లు...
 అప్రకటిత విద్యుత్ కోతలు, ఓవర్ లోడ్ సమస్యతో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు  ఓవర్ లోడ్ వల్ల ఎక్కువ కాలిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు అన్ని కేటగిరీల్లో కలుపుకుని మొత్తం 56,762 ఉన్నాయి. దీనికిగాను కనీసం 4 శాతం ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్‌శాఖ స్టోర్‌లో ఉండాలి. కానీ 16 కేవీ నుంచి 100 కేవీ వరకు 780 ట్రాన్స్‌ఫార్మర్లు కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాలకు రోజుకు రెండు చొప్పున కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు 40 వరకు వస్తున్నాయి. కరెంట్ వ చ్చిరావడంతోనే రైతులందరూ ఒకేసారి విద్యుత్ మోటర్లు ఆన్‌చేస్తున్నారు. దీని వల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడ్ పడుతోంది. తరచు కరెంట్ ట్రిప్ అవుతుండడంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ట్రా న్స్‌ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరో ట్రాన్స్‌ఫార్మరు బిగిం చాలి. కానీ ఎక్కడా దీనిని అమలు చేయడంలేదు.  
 
 స్తంభించిన సేవలు...
 విద్యుత్ పంపిణీ సంస్థ, ట్రాన్స్‌కో కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో సేవలు స్తంభించిపోయాయి. వీరి స్థానాల్లో లైన్‌మన్లు, ఏఈలు, డీఈలు, టెక్నికల్ డీఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పనిభారం పెరిగి సబ్‌స్టేష న్లలో విధులు నిర్వర్తించడం కష్టసాధ్యమవుతోందని అధికారులు అంటున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ, దాని పరిధిలోని సబ్‌స్టేషన్లలో కలిపి కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 1500మంది ఉన్నారు. వీరంతా సమ్మెలోకి దిగడంతో  జిల్లా కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సబ్‌స్టేషన్‌లో కరెంట్ కటర్స్ వరకు అన్ని విధులు లైన్‌మన్, ఏఈలు మొదలుకొని డీఈల వరకు పనిచేయాల్సి వస్తోంది. ఇక ట్రాన్స్‌కో పరిధిలో 132 కేవీ సబ్‌స్టేషన్లు 27,220 కేవీ సబ్‌స్టేషన్లు 5 మొత్తం కలిపి 32 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో సబ్‌స్టేషన్‌కు 11మంది చొప్పున కాంట్రాక్టు ఉద్యోగులు 352మంది ఉన్నారు. ఆయా సబ్‌స్టేషన్లలో  ప్రతి 8 గంటల కోసారి కాంట్రాక్టు ఉద్యోగులు డ్యూటీలు మారి పనిచేయా ల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వారంతా ఒకేసారి సమ్మెలోకి దిగడంతో ఆ బాధ్యతలను జూనియర్ లైన్‌మన్ నుంచి డీఈ వరకు చేయాల్సి వస్తోంది. లైన్స్ బ్రేక్‌డౌన్ సరిచూసుకోవడం, సబ్‌స్టేషన్ మెయింటెన్స్ వంటివన్నీ కూడా ప్రస్తుతం లైన్‌మన్లు, డీఈలు దగ్గర ఉండి చూసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడా లేకపోవడంతో వంతుల వారీ విధులు నిర్వర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో రోజువారీ విధులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
 
 లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి
 నాంపల్లి మండలంలో కరెం టు కోత తీవ్రంగా ఉంది. రోజుకు ఐదారు గంటలు కూడా రావట్లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నరు. పగలు రెండు గంటలు,రాత్రి మూడు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందులోనూ లోఓల్టేజీతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు తగులబడుతున్నాయి. కాలిన ట్రాన్స్‌ఫార్మర్లను వారంరోజులైనా బాగుచేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయి.
  - దండిగ సత్తయ్య, రైతు, పసునూరు, నాంపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement