
సాక్షి, కృష్ణా : విజయవాడలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓ వైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ర్యాలీకి భారీగా ఉద్యోగులు హాజరైయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment