
బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందిన ఉద్యోగులు
మైసూరు: రాచనగరిలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ బెడద వేధిస్తోంది. మైసూరు పాలికె కాంట్రాక్టు ఉద్యోగులు వినోద్ (28), రవి (38) బ్లాక్ ఫంగస్‌తో చనిపోయారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను తరలించే రవికి గత 16 రోజుల క్రితం కోవిడ్ సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కూడా కనిపించగా బుధవారం మరణించాడు. ఫాగింగ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్‌కు మూడు రోజుల క్రితమే కరోనాతో పాటు ఫంగస్ సోకడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం మరణించాడు. దీంతో పాలికె ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
చదవండి: డేంజర్ జోన్‌లో 6 జిల్లాలు
చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష?
Comments
Please login to add a commentAdd a comment