
'కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం'
గురుకుల పాఠశాల ఉపాధ్యాయ, సిబ్బందికి ఉద్యోగ వయో పరిమితిని ప్రస్తుతమున్న 58 సంవత్సరాల నుంచి 60కి పెంచుతామని సాంఘికసంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు.
హైదరాబాద్: గురుకుల పాఠశాల ఉపాధ్యాయ, సిబ్బందికి ఉద్యోగ వయో పరిమితిని ప్రస్తుతమున్న 58 సంవత్సరాల నుంచి 60కి పెంచుతామని సాంఘికసంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అంతేకాకుండా వారికి హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. వారి జీతాలు ట్రెజరీ ద్వారా అందిస్తామన్నారు. అంతేకాకుండా గురుకుల పాఠశాల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు.