కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులకు భరోసా | Guarantee for contract and outsourcing employees | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులకు భరోసా

Published Tue, Dec 14 2021 4:49 AM | Last Updated on Tue, Dec 14 2021 10:56 AM

Guarantee for contract and outsourcing employees - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం 2019 నుంచి రాష్ట్రప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్టు కార్యదర్శుల కమిటీ తన నివేదికలో తెలిపింది. 27 శాతం ఐఆర్‌ అమలు, అంగన్‌వాడీ, ఆశ, ఇతర ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు పేర్కొంది. 

► ప్రభుత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్‌లకు రాష్ట్రప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తోంది. 
► 2019 జూలై 1 నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఐఆర్‌ కింద ఉద్యోగులు, పెన్షనర్‌లకు రూ.15,839.99 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.11,270.21 కోట్లు, ఉద్యోగుల కోసం, రూ.4,568.78 కోట్లు పెన్షనర్‌ల కోసం వెచ్చించింది. 
► అంగన్‌వాడీలు, ఆశావర్కర్‌లు, హోమ్‌గార్డులు సహా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాలు, రోజువారీ వేతనాలు పెంపొందించింది. వీరి వేతనాలు, జీతాల కోసం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు రూ.1,198  కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది.


కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌
► కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీరికి మినిమం టైమ్‌ స్కేల్‌ను అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్‌ 18న టైమ్‌ స్కేల్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మొదటి రెండు ప్రసవాలకు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను వర్తింపచేసింది. 
► కాంట్రాక్టు ఉద్యోగి యాక్సిడెంటల్‌గా మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేసింది. 
► అదనంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కల్పించిన వసతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.360 కోట్ల మేర ఖర్చు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement