Employees salaries
-
జీతాలపై వికృత రాతలు
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వకుండా పోస్ట్ డేటెడ్ జీవోలతో మభ్యపుచ్చినా ఈనాడు రామోజీకి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, చివరకు చిరుద్యోగులైన పారిశుధ్య సిబ్బందికి జీతాల పెంపు దేవుడెరుగు.. ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు కనీసం జీతాలు ఇవ్వకపోయినా ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా సకాలంలో చెల్లిస్తుంటే వక్రీకరణలతో పచ్చ పత్రికలో కట్టు కథలు ముద్రిస్తున్నారు. నాడు దళారీల దందా.. చంద్రబాబు హయాంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక్క నెల కూడా సమయానికి జీతాలివ్వలేదు. ఏజెన్సీల పేరిట టీడీపీ నేతలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ మధ్య దళారీలు లేకుండా నెల నెలా సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నా రామోజీ తప్పుడు కథనాలు వండుతున్నారు. కోవిడ్ లాంటివి లేకున్నా.. ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులదీ నాడు అదే దుస్థితి. మొదటి వారంలో జీతాలు అందుకోవడం గగనమే. అంగన్వాడీలకు నెలల తరబడి బకాయిలే. మధ్యాహ్న భోజన కార్మికులకూ బాకీలే. ఇక 108, 104 ఉద్యోగులదీ అదే పరిస్థితి. కొందరికైతే సంవత్సరం దాటినా జీతాలు అందని దయనీయ పరిస్థితులు చంద్రబాబు పాలనలో నెలకొన్నాయి. గత సర్కారు హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభం లేదు. లాక్డౌన్లు, ఆర్థిక ప్రగతి మందగమనం లాంటి పరిస్థితులూ ఉత్పన్నం కాలేదు. అయినా సరే ఏనాడూ జీతాలు సకాలంలో ఇచ్చిన పాపాన పోలేదు. సంక్షోభాలను అధిగమిస్తూ సకాలంలో.. కోవిడ్ సంక్షోభంతో పాటు ఆర్థిక మందగమనం లాంటి ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం నిర్వర్తించని విధంగా సంక్షేమాన్ని, నెలకు సుమారు రూ.1,700 కోట్లకు పైగా సామాజిక పెన్షన్ల బాధ్యతనూ నెరవేరుస్తూనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులను సక్రమంగా నిర్వర్తిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం అప్కాస్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది. దళారీలను నిర్మూలించి ఏజెన్సీ వ్యవస్థను రూపుమాపింది. నేరుగా వారి ఖాతాల్లోకే మొదటి తారీఖు కల్లా జీతాలు జమ చేస్తోంది. ఐఏఎస్‌ల కంటే ముందుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తోంది. తొలి ఏడు రోజుల్లోనే క్రమం తప్పకుండా జీతాలు ఇస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చినా, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఏపీలో జీతాల చెల్లింపులు చాలా మెరుగ్గా ఉన్నాయన్నది సుస్పష్టం. డిసెంబర్ నెలలో 12వ తేదీ నాటికి సుమారు రూ.6 వేల కోట్లను జీతాల కోసం ప్రభుత్వం చెల్లించింది. అదే పొరుగున ఉన్న రాష్ట్రంలో జిల్లాల వారీగా జీతాల చెల్లింపులు చేస్తున్నారు. ఏ రోజు కూడా మొదటి తారీఖు అనే మాటే లేదు. ప్రతి నెలా తేదీ, ఆ తర్వాతే చెల్లింపులు చేస్తున్నారు. ఇదీ చదవండి: రామోజీ.. అస్మదీయ తకథిమి -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవో విడుదల
-
AP: సెలవైనా.. శరవేగంగా
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలు సెలవు రోజైన ఆదివారం సైతం శరవేగంగా బిల్లుల ప్రాసెస్ నిర్వహించాయి. ఆర్థికశాఖ ఆదేశాలతో ప్రత్యక్షంగా కలెక్టర్లే రంగంలోకి దిగి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెలాఖరు కావడంతో సాయంత్రం కల్లా పూర్తి చేసేలా అన్ని జిల్లాల్లో ప్రాసెస్ జరుగుతోంది. శని, ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రెజరీ ఉద్యోగులు బిల్లులను అప్లోడ్ చేశారు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఆర్సీ ప్రకారం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పే అండ్ అకౌంట్స్‌లో 50 వేల బిల్లులను అధికారులు ప్రాసెస్ చేశారు. ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి పెన్షనర్ల బిల్లులను ఉద్యోగులు సిద్ధం చేయనున్నారు. కాగా, 1వ తేదీ వరకు ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధమవుతుంది. కొత్త జీతాలతో వాస్తవాలు వెల్లడి.. కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను అందుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలను అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అందరి జీతాలు పెరిగాయని స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. అందుకనే శరవేగంగా జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. కొన్ని రాజకీయ శక్తులు పన్నిన కుట్రలకు ఉద్యోగులు బలి కాకుండా కాపాడుకుంటూ నిజం ఏమిటో తెలియజేసేలా చర్యలు చేపట్టింది. జీతాలు తగ్గుతాయన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మొత్తాలను ఫిబ్రవరి 1 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి అడ్డుపడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని గట్టి సంకేతాలనిచ్చింది. విజయనగరంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన డీడీవోలకు మెమోలిచ్చారు. తమ ఎత్తుగడలు పారవనే కొన్ని సంఘాలు ఉద్దేశపూర్వకంగా జీతాల బిల్లుల ప్రాసెస్ పనులకు అడ్డుపడుతున్నట్లు తెలిసింది. విజయనగరంలో మెమోలు విజయనగరం జిల్లాలో జనవరి వేతనాల ప్రక్రియ పనులను చేపట్టకుండా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఆర్థిక శాఖ ఆదేశాలను అమలు చేయని 175 మంది డీడీవోలకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మెమోలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ట్రెజరీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమైన 177 కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన డీడీవోల వివరాలను సేకరించారు. 2 విభాగాల నుంచి మాత్రమే వేతనాల పనులను పూర్తి చేయగా మిగిలిన 175 శాఖల డీడీఓలు ప్రారంభించలేదని గుర్తించి వారందరికీ మెమోలను జారీ చేశారు. సోమవారం కూడా సమయం ఉన్నందున బిల్లుల ప్రాసెస్ జరిగేలా చర్యలు చేపట్టారు. చిత్తూరులో సజావుగా.. చిత్తూరు జిల్లాలో కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లుల చెల్లింపు జరిగేలా కలెక్టర్ హరినారాయణన్ పర్యవేక్షించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఆదివారం పనిచేసినట్లు చెప్పారు. అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించామన్నారు. ఉత్తర్వులు పాటించాల్సిందే.. ప్రకాశం జిల్లాలో అన్ని శాఖల డీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా అధికారులకు డీడీవోలతో పని చేయించాలని, లేనిపక్షంలో మెమోలు జారీ చేయాలని ఆదేశించామన్నారు. పనిచేయని డీడీవోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఉత్తరాంధ్రలో వేగంగా.. విశాఖపట్నం జిల్లాలో బిల్లుల ప్రక్రియను సోమవారం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. మొత్తం 1,299 మంది డీడీవోలుండగా ఇప్పటి వరకు 227 మంది వేతన బిల్లుల ప్రక్రియను ప్రారంభించారన్నారు. 39 మంది డీడీవోలు తమ పనిని పూర్తి చేశారు. మిగిలిన ప్రక్రియ సోమవారం పూర్తి కానుంది. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి డీడీఓలు 1,068 మంది ఉండగా ఇప్పటివరకు 180 మంది బిల్లుల పని ప్రారంభించారు. వీరిలో 31 మంది పూర్తి చేశారు. ఉభయ గోదావరిలో రెండు రోజులుగా.. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 సబ్ ట్రెజరీల్లో 145 మంది ట్రెజరీ ఉద్యోగులు విధుల్లో పాల్గొని పోలీసు, అగ్నిమాపక, ట్రెజరీ, విజలెన్స్, ఏసీబీ తదితర విభాగాల్లో 1,200 మంది ఉద్యోగుల బిల్లులను ప్రాసెస్ చేశారు. 26,800 మంది పింఛనుదారుల బిల్లులను సైతం ప్రాసెస్ చేసినట్టు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ట్రెజరీతో పాటు సబ్ ట్రెజరీల్లో రెండు రోజులుగా పోలీసు, ఏపీఎస్పీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, న్యాయశాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు 8 వేల వరకు పూర్తి చేశారు. పెన్షన్లకు సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఆదేశాలను కచ్చితంగా పాటిస్తాం గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను ఖాతాల్లో జమ చేసే పనిలో ఖజానా శాఖ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్లోని ఖజానా కార్యాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నట్లు ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రాజగోపాలరావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1కల్లా జిల్లాలోని 39 వేల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు మొత్తం జమ అవుతుందన్నారు. జిల్లాలో 35,706 మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో డీడీవోలు 50 బిల్లులను ప్రాసెస్ చేశారని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,283 డీడీవోల పరిధిలో 34,346 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 16,392 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. అనంత, కర్నూలు, నెల్లూరుల్లోను.. అనంతపురం జిల్లాలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో డీడీఓలు, ఎస్టీఓలు విధుల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాలో జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పంపాలని అన్ని శాఖల డీడీవోలను ఆదేశించినట్టు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి బిల్లులు రాగా ట్రెజరీ అధికారులు ప్రాసెస్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పలు శాఖలకు చెందిన 200 మంది డీడీవోలు జనవరి జీతాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపినట్టు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. మిగతావి కూడా సిద్ధమవుతున్నాయని, సోమవారం వరకు అవకాశం ఉన్నందున మోమోలు ఇవ్వలేదని చెప్పారు. -
జూనియర్లకు లక్షల్లో జీతాలు.. నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న హైదరాబాద్
చారిత్రాత్మక కాస్మోపాలిటన్ నగరం హైదరాబాద్ వేలాది మంది నిరుద్యోగుల కలల స్వప్నం. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి చాలా మంది వస్తుంటారు. ఇందులో చాలా మంది లక్ష్యం ఐటీ సెక్టార్లో కొలువు సంపాదించడమే. ఇలా ఉద్యోగన్వేషలో వచ్చే వారికి పెద్ద మొత్తంలో జీతాలు ఆఫర్ చేస్తున్నాయి నగరంలో కోలువైన కంపెనీలు. జీతాలు ఎలా ఉన్నాయి ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సెక్టార్లలో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలు ఎలా ఉన్నాయమనే అంశంపై రాండ్‌స్టాండ్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. రాండ్‌స్టాండ్ నివేదికను పరిశీలిస్తే.. ఐటీ సెక్టార్లో హైదరాబాద్ నగరం నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతోందని తెలుస్తోంది. దేశంలో ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, కోలక్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పూనే నగరాల్లో ఐటీ పరిశ్రమ ఎక్కువగా నిలదొక్కుకుంది. ఈ నగరాల డేటాను పరిశీలిస్తే ఐటీ ఎంప్లాయిస్‌కి ఎక్కువ జీతాలు ఇవ్వడంలో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో ఉంది. జీతాల తీరు ఇలా ఇక ఐటీ సెక్టార్లో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలను పరిశీలిస్తే.. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకి హైదరాబాద్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఐదేళ్ల అనుభవం ఉన్న జూనియర్ లెవల్‌కి సంబంధించిన ఉద్యోగులకు హైదరాబాద్‌లో వార్షిక వేతనం రూ.5.93 లక్షలుగా ఉండగా బెంగళూరులో ఇది రూ. 6.71 లక్షలుగా ఉంది. 6 నుంచి 14 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మిడ్ లెవల్ కేటగిరిలో హైదరాబాద్‌లో వార్షిక వేతనం 17.71 లక్షలు ఉండగా బెంగళూరులో రూ.18.06 లక్షలుగా ఉంది. 15 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ కేటగిరిలో హైదారాబాద్‌లో యాన్యువల్ శాలరీ రూ. 29.78 లక్షలు ఉండగా బెంగళూరులో రూ. 34.47 శాతంగా ఉంది. స్వల్ప తేడా ఐటీ సెక్టార్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌లలో చెల్లిస్తున్న జీతాలను పరిశీలిస్తే.. జూనియర్ కేటగిరికి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య వ్యత్యాసం 11.6 శాతం ఉండగా మిడ్ లెవల్ కేటగిరిలో ఇది 2 శాతానికే పరిమితమైంది. సీనియర్ కేటగిరిలో మాత్రం హైదరాబాద్ కంటే బెంగళూరులో ఉన్న ఉద్యోగికి 16 శాతం అధికంగా వేతనం అందుతోంది. నవంబర్ వన్ రేసులో గడిచిన పదేళ్లుగా భారీ కంపెనీలను ఆకర్షించడంలో బెంగళూరుతో పోటీ పడుతోంది హైదరాబాద్. అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. అంతేకాదు ఇటీవల కాలంలో స్టార్టప్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విధానం ఖరారైంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే జూనియర్, మిడ్ కేటగిరిల్లో బెంగళూనును హైదరాబాద్ దాటవచ్చనే అంచనాలు ఉన్నాయి. చదవండి: ఎక్సెల్లో కొత్త ఫీచర్లు.. చిరకాల డిమాండ్ నెరవేర్చిన మైక్రోసాఫ్ట్ -
ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు జీతాలు తగ్గించొచ్చు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించవచ్చని హైకోర్టు తెలిపింది. జీతాలు తగ్గించకూడదని ఎక్కడా లేదని, అది యజమాని (రాష్ట్ర ప్రభుత్వం) సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం ఆదాయాలు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జీతాలు తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా వాటి సర్దుబాటు పరిపాటి అని, ఎక్కువ జీతాలు ఇచ్చిన చోట రికవరీ చేస్తామని అంటే మీరెలా అభ్యంతరం చెబుతారని ఉద్యోగులను ప్రశ్నించింది. శాతాల ఆధారంగా కాకుండా వాస్తవ రూపంలో (నగదు) ఎంత పొందుతున్నారో లెక్కలు వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇది సర్వీసు వివాదమైనందున, రోస్టర్ ప్రకారం తాము విచారణ జరపడం సమంజసం కాదని చెప్పింది. సీజేను సంప్రదించి ఈ వ్యాజ్యాన్ని తగిన బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.శ్రీభానుమతి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణతో జారీ చేసిన జీవో 1పై ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణ్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులే.. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ, అశుతోష్ మిశ్రా కమిషన్ (పీఆర్సీ) నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఎక్కువ జీతాలు చెల్లించి ఉంటే రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే జీతాలు తగ్గించవచ్చునని చెప్పింది. కొత్త వేతన సవరణ వల్ల జీతం ఏ రకంగా తగ్గిందో చెప్పాలని కోరింది. మీరు శాతాల్లో తగ్గిందంటున్నారు. శాతం తగ్గినంత మాత్రాన మీ వాస్తవ చెల్లింపులు పెరిగి ఉంటే, తగ్గిందని ఎలా అంటారు? కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులు మాత్రమే.’ అని తేల్చి చెప్పింది. సమ్మె పేరుతో బెదిరిస్తున్నారు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ తక్కువ చేయలేదు. పీఆర్సీ నివేదికను కార్యదర్శుల కమిటీ అందరికీ అందుబాటులో ఉంచింది. ఉద్యోగ సంఘాలతో 9 సార్లు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి సమక్షంలో ఓసారి జరిగాయి. సిఫారసులు ఎలా ఉండబోతున్నాయో ప్రతి ఉద్యోగ సంఘం నేతకూ తెలుసు. ప్రభుత్వం తన ఉద్యోగుల నుంచే సమ్మె బెదిరింపును ఎదుర్కొంటోంది. ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తామంటున్నారు. కోర్టు జోక్యాన్ని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలు జరపలేరా? ప్రభుత్వం కూడా చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రావాలని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోరారు. వారు చర్చలకు రాకుండా 3 గంటలకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు వస్తామని చెబుతున్నారు’ అని వివరించారు. రెవెన్యూ రూ.60 వేల కోట్లకే పరిమితం ‘ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచాం. గ్రాట్యుటీ రూ.16 లక్షలకు పెంచాం. ప్లాట్ల కేటాయింపులో ఉద్యోగులకు 20 శాతం రిబేటు ఇచ్చాం. వీటన్నింటినీ ఓ ప్యాకేజీ కింద ఇచ్చాం. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10,825 కోట్ల భారం పడుతుంది. అయినా వారి కోసం భరిస్తున్నాం. అదీ కోవిడ్ పరిస్థితుల్లో. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పడిపోయింది. 2018–19 సంవత్సరంలో రూ.62,473 కోట్లుగా ఉన్న ప్రభుత్వ రెవెన్యూ 2019–20కి రూ.60,933 కోట్లకు, 2020–21కి రూ.60,688 కోట్లకు పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో 15 శాతం వృద్ధితో రెవెన్యూ రూ.75 వేల కోట్లకు చేరాలి. అందుకు భిన్నంగా రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2018–19లో జీతాల చెల్లింపులు రూ.52 వేల కోట్లుగా ఉంటే, 2021–22 నాటికి రూ.67 వేల కోట్లకు చేరింది. ఇవన్నీ ఉద్యోగులకు తెలుసు’ అని శ్రీరామ్ వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. 3 గంటలకు అంటున్నారు కాబట్టి, మధ్యాహ్నం 2.15కు మా ముందుకు రావాలని ఆ ప్రతినిధి బృందానికి చెప్పాలని అంది. ఆ బృందంలో కొందరు సీఎస్ వద్దకు వెళ్లొచ్చని, కొందరు వర్చువల్ విధానంలో మా ముందుకు రావాలని తెలిపింది. 12 మంది వచ్చినా కూడా అభ్యంతరం లేదంది. ఈ వ్యవహారాన్ని వివాదంగా చూడొద్దంది. ఇరుపక్షాల మధ్య ఇగో అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. సమయం వృథా చేసినందుకు క్షమించండి భోజన విరామం తరువాత ధర్మాసనం స్పందిస్తూ, ‘మేం బెంచ్ దిగిపోయిన తరువాత మాకో సందేహం వచ్చింది. ఇది పిల్ కాదు. పునర్విభజన చట్ట వివాదం కూడా కాదు. సర్వీస్ వివాదం అవుతుంది. సర్వీసు వివాదంపై మా బెంచ్ ఎలా విచారిస్తుంది అన్న సందేహం వచ్చింది. దీనిపై రిజిస్ట్రీ నుంచి కూడా స్పష్టత కోరాం. ఈ వ్యాజ్యంపై రోస్టర్ ప్రకారం మేం విచారించడం సబబు కాదు. ఈ విషయం తెలియక సమయం వృథా చేశాం. ఇందుకు అందరూ క్షమించాలి’ అని కోరింది. -
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం 2019 నుంచి రాష్ట్రప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్టు కార్యదర్శుల కమిటీ తన నివేదికలో తెలిపింది. 27 శాతం ఐఆర్ అమలు, అంగన్వాడీ, ఆశ, ఇతర ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు పేర్కొంది. ► ప్రభుత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్రప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. ► 2019 జూలై 1 నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఐఆర్ కింద ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.15,839.99 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.11,270.21 కోట్లు, ఉద్యోగుల కోసం, రూ.4,568.78 కోట్లు పెన్షనర్ల కోసం వెచ్చించింది. ► అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోమ్‌గార్డులు సహా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాలు, రోజువారీ వేతనాలు పెంపొందించింది. వీరి వేతనాలు, జీతాల కోసం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ► కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీరికి మినిమం టైమ్ స్కేల్‌ను అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్ 18న టైమ్ స్కేల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మొదటి రెండు ప్రసవాలకు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను వర్తింపచేసింది. ► కాంట్రాక్టు ఉద్యోగి యాక్సిడెంటల్‌గా మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేసింది. ► అదనంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కల్పించిన వసతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.360 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. -
సంక్షేమానికి దీటుగా అభివృద్ధి
సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, వ్యయం చేస్తోందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్లేషించింది. 2019 – 20 నుంచి వరుసగా పరిశీలిస్తే అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోందని ఆర్బీఐ నివేదికతో స్పష్టమవుతోంది. అభివృద్ధి వ్యయం 2020–21తో పోల్చితే 2021–22లో ఏకంగా 33.5 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. సామాజిక రంగాల వ్యయం కూడా భారీగా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలపై ఆర్బీఐ విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. ఇక 2019–20 నుంచి ఉద్యోగుల జీతభత్యాలు బాగా పెరిగాయని, అలాగే గతంలో చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులూ అధికమయ్యాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై వ్యయం పెరిగిందని తెలిపింది. పెరిగిన జీతభత్యాల పద్దు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 శాతం మధ్యంతర భృతి పెంచారు. వైద్య ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను కల్పించడంతో పాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. దీంతో జీత భత్యాల పద్దు భారీగా పెరిగింది. గత సర్కారు హయాంలో 2018–19లో ఉద్యోగుల జీతభత్యాల పద్దు రూ.32,743.40 కోట్లు ఉండగా 2021–22లో అది రూ.50,662.20 కోట్లకు చేరిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహారం నిల్వ తదితర రంగాల వ్యయం 2019–20లో మొత్తం బడ్జెట్లో 45.4 శాతం ఉండగా 2021–22లో 49.4 శాతానికి పెరిగింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై గత మూడు సంవత్సరాలుగా బడ్జెట్లో వ్యయం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2019–20లో బడ్జెట్లో ఈ రంగంపై 4.3 శాతం వ్యయం చేయగా 2020–21లో 5.2 శాతం వ్యయం చేసినట్లు తెలిపింది. 2021–22లో 6.1 శాతం మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించింది. అభివృద్ధికే ఎక్కువ వ్యయం ప్రధాన ఆర్థిక సూచికల ప్రకారం చూస్తే మూడు ఆర్ధిక సంవత్సరాల్లో అభివృద్ధియేతర వ్యయం కన్నా అభివృద్ధికే ఎక్కువ వ్యయం చేస్తున్నట్లు ఆర్బీఐ అధ్యయన నివేదిక తెలిపింది. -
ధనిక రాష్ట్రంలో జీతాలకు కోతలా?
సాక్షి, హైదరాబాద్: ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపులకు కష్టాలొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దేశంలోనే తెలంగాణను ధనిక రాష్ట్రంగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులకు కేటగిరీల వారీగా కోత విధించి వారిని ఇబ్బందుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. బుధవా రం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో కోతలు విధించడాన్ని తప్పుబట్టిన ఉత్తమ్.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయం అంత పతనమవుతుందా? ‘కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే లాక్డౌన్ కాలంలో ఆదాయం లేదనే కారణంతో ఉద్యోగులకు ఇచ్చే నెలవారీ వేతనాల్లో కోతలు పెట్టడం సరికాదు. వారం రోజుల పాటు లాక్డౌన్ అయితే ప్రభుత్వ ఆదాయం అంత పతనమవుతుందా? ఉద్యోగులకు నెలవారీగా వేతనాల కింద రూ.3,500 కోట్లు ఇస్తున్నాం. అంత మొత్తాన్ని సర్దుబాటు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. అంతటి ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలివ్వని దౌర్భాగ్యం నెలకొనడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి వేతనాన్ని ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు రూ.72 వేల కోట్లు ఖర్చు చేశారు. మళ్లీ రూ.22 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఉద్యోగులకు వేతనాలివ్వని పరిస్థితిలో ఇంత పెద్ద మొత్తంలో పనులకు టెండర్లు పిలవడం గమనార్హం’అని ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆస్పత్రులు కట్టలే.. వసతులు కల్పించలే..: భట్టి అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని అరికట్టేందుకు రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేస్తామన్న సీఎం కేసీఆర్.. ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ‘కరోనాతో ప్రభుత్వ ఆదాయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రభావం పడలేదు. వారం పది రోజులు బంద్ పెడితే ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఖర్చులు చేయలేదు. కొత్తగా ఆస్పత్రులు కట్టలేదు. కనీసం కొత్త మౌలిక వసతులు కల్పించలేదు. అంతలోనే ఆర్థిక వ్యవస్థ ఇంత పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాతలు ఇచ్చిన విరాళాలు అధికంగా ఉన్నాయి’అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దివాలాకోరుతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కరోనా సంక్షోభమంటూ సాకును చూపుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఎక్కువ కష్టపడుతున్నారని, ఇలాంటి సమయంలో రెట్టింపు వేతనాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం కోతలు పెట్టడం సరికాదని చెప్పారు. -
కేసీఆర్ తాతా కనికరించవా?
హన్మకొండ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్లో భాగంగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి కుమార్తె ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పోస్టర్ ద్వారా అభ్యర్థిస్తోంది. జిల్లాలోని కమలాపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాశ్‌రావు హన్మకొండ నయీంనగర్‌లో నివాసముంటున్నారు. ఉపాధ్యాయురాలైన ఈయన భార్య సునీత ఫిబ్రవరి 22న మృతి చెందింది. ఈ బాధలో ఉన్న తమపై ఇప్పుడే జీతాల కోతతో మరోసారి బాధ పెట్టొద్దు కేసీఆర్ తాత అంటూ సత్యప్రకాశ్‌రావు కూతురు లాస్య ప్లకార్డు ప్రదర్శిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తోంది. (కరోనా :అపోహలూ... వాస్తవాలు) -
ఉద్యోగుల వేతనంలో కొంత వాయిదా
సాక్షి, అమరావతి: అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మరో పక్క కోవిడ్–19 నియంత్రణతో పాటు ఇతర అత్యవసర వ్యయానికి నిధులు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ పదవుల్లోని వారికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు మార్చి నెల వేతనాలను చెల్లించకుండా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. – అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అధికారులందరి మార్చి వేతనాల్లో 40 శాతం చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు. – రాష్ట్ర ప్రభుత్వ మిగతా ఉద్యోగులకు మార్చి నెల వేతనాల్లో 50 శాతం చెల్లింపు, మిగతా 50 శాతం వాయిదా. – నాలుగవ తరగతి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు చెల్లింపు. మిగతా 10 శాతం వేతనం వాయిదా. – అన్ని రకాల పింఛన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు 50 శాతం పెన్షన్‌ను వాయిదా వేశారు. – అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వేతనాలను వాయిదా వేశారు. వాయిదా వేసిన వేతనాలను పరిస్థితి కుదుట పడగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. – రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యారాయణ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల సగం జీతం ఇస్తామని, పరిస్థితి సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామన్న సీఎం ప్రతిపాదనకు అంగీకరించామని ఆయన తెలిపారు. -
‘ఆర్టీసీ’ జీతాలకు పైసల్లేవ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీ కారి్మకులకు సెప్టెంబర్ జీతాలు చెల్లించేందుకు సరిపడా డబ్బుల్లేవని హైకోర్టుకు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందని ఆ సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. సెపె్టంబర్ జీతాలు చెల్లించాలంటే రూ.239.68 కోట్లు అవసరమని, ప్రస్తుతం ఆర్టీసీ ఖాతాలో రూ.7.49 కోట్లే ఉన్నాయని వివరించారు. ఆర్టీసీ సిబ్బంది పనిచేసిన సెప్టెంబర్ నెలకు జీతాలు చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించా లని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు తో పాటు మరొకరు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి విచారించారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వమే ఆదుకుంటోంది.. ఏటా ప్రభుత్వం ఆదుకుంటేనే ఆర్టీసీ నిర్వహణ జరుగుతోందని అదనపు ఏజీ చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ కౌంటర్ పిటిషన్ ద్వారా సంస్థ ఆర్థిక స్థితిగతులను వివరించారు. వాటిని అదనపు ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘ఏటా ఆరీ్టసీకి రూ.1,200 కోట్ల మేరకు నష్టం వస్తోంది. సంస్థ రాబడిలో 58 శాతం జీతాలకే సరిపోతోంది. 2015లో ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల ఆరీ్టసీపై రూ.900 కోట్ల భారం పడింది. 2017లో మధ్యంతర భృతి 16 శాతం ఇవ్వడం వల్ల రూ.200 కోట్లు వార్షిక భారం పడింది. ఆర్టీసీ సొంతంగా 8,357 బస్సులు, 2,103 అద్దె బస్సులు నడుపుతోంది. వీటిని నడపటం ద్వారా ఏటా రూ.4,882 కోట్లు ఆదాయం వస్తుంటే, వ్యయం రూ.5,811 కోట్లు అవుతోంది. సొంత రాబడి నిధులతో ప్రతి నెలా మొదటి వారంలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతోంది. దీంతో ప్రతి నెలా ప్రభుత్వ చేయూతతోనే జీతాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఆర్టీసీ అప్పు రూ.4,709 కోట్లు. ఇందులో రూ.1660 కోట్లు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ, పీఎఫ్, లీవ్ క్యాష్, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర చెల్లింపుల కోసం రూ.3,049 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం రుణాలు చేయాల్సి వచి్చంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి నష్టాలు రూ.5,269.25 కోట్లకు పేరుకున్నాయి. రోజూ టికెట్ల ద్వారా రూ.10 కోట్లు, పండుగల సమయంలో రూ.13 కోట్లు డబ్బు వస్తుంది. సిబ్బంది సమ్మె వల్ల రూ.125 కోట్లకుపైగా అదనపు నష్టం వాటిల్లుతోంది’అని పేర్కొన్నారు. ఎంత చెప్పినా వినలేదు.. ‘ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. సమ్మె చేస్తే పరిస్థితులు చక్కబడతాయని ఆశించొద్దని హితవు పలికినా ఖాతరు చేయకుండా సమ్మెలోకి వెళ్లారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించాలి’అని వాదించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. జీతాల నగదు సమాచారాన్ని ఆర్టీసీ తప్పుగా చెబుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఉన్నతాధికారుల జీతాలు రూ.100 కోట్ల వరకు చెల్లించిన యాజమాన్యం ఇంకా రూ.239 కోట్లు అవసరమని చెప్పడం వాస్తవం కాదన్నారు. సిబ్బందికి జీతాలుగా చెల్లించాల్సింది రూ.140 కోట్ల లోపేనన్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్నా 70 శాతానికిపైగా బస్సులు నడుపుతున్నామని మరో కౌంటర్ పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం వాటి ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో హైకోర్టుకు వివరించలేదని చెప్పారు. ఎంత ఆదాయం వచ్చిందో వివరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం విచారణ 29కి వాయిదా పడింది. కాగా, ఆర్టీసీ సమ్మెపై దాఖలైన మూడు వేరు వేరు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిõÙక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రతివాదులకు నోటీసులిచ్చింది. -
దుష్ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ
సాక్షి, అమరావతి: కొన్ని సామాజిక మాద్యమాలు, పలు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడానికి నిధుల కొరత కారణం కాదని ప్రకటన చేసింది. ‘సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్బీఐ ఈ-కుబేర్ (ఈ-కుబేర్ పద్ధతిలో వేతనాలు రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. అదే ప్రకారం అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా జులై 31నే ఆర్బీఐకి పంపడం జరిగింది. 1వ తేదీ మధ్యాహ్నంకు పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల ఫైళ్లు చెల్లించాం. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన ఫైళ్లు చెల్లింపు ఆలస్యం అయింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మిగిలిన జీతాలు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. తొలగిన సాంకేతిక సమస్య ఉద్యోగుల జీతాలు, ఫించన్ల చెల్లింపుల్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్య తొలగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించినట్లు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. -
ఆర్థిక శాఖ ధిక్కార శైలి
సాక్షి, అమరావతి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఖజానాను ఖాళీ చేయడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర వ్యవహార శైలిపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా రవిచంద్ర వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా రవిచంద్ర ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేయడం పట్ల నివ్వెరపోతున్నారు. ఈనెల 27న కాంట్రాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు చెల్లింపు ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల కోసం మిగతా రంగాలకు ఇవ్వ కుండా కొన్ని నిధులను నిల్వ ఉంచుతారు. అయితే రవిచంద్ర పనితీరు అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈనెల 27న కాంట్రాక్టర్లకు ఆయన ఏకంగా రూ.1,000 కోట్ల బిల్లులను చెల్లించేశారు. నాబార్డు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన పనులైనా సరే ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తరువాతే మిగతా రంగాల బిల్లులను ఆర్థిక శాఖ చెల్లిస్తుంది. ప్రతి నెల 1వతేదీ నుంచి 10వతేదీ వరకు కేవలం ఉద్యోగుల వేతనాల బిల్లులనే మంజూరు చేస్తారు. 10వ తేదీ తరువాతే మిగతా రంగాలకు చెందిన బిల్లులను పాస్ చేస్తారు. అయితే ఉద్యోగుల వేతనాలను చెల్లించడానికి సైతం ఖజానాలో నిధులు లేకుండా ఖాళీ చేయడమే లక్ష్యంగా రవిచంద్ర పని చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న విషయం తేటతెల్లమైనప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేయడం పట్ల సచివాలయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రెండు రోజుల్లో రూ.2,325 కోట్లు ఎన్నికల ఫలితాల ముందు రోజు అంటే 22వ తేదీన ఏకంగా రూ.2,025 కోట్ల మేర బిల్లులను కాంట్రాక్టర్లకు రవిచంద్ర చెల్లించేసిన విషయం తెలిసిందే. ఫలితాల రోజు అంటే 23వ తేదీన మరో రూ.300 కోట్ల బిల్లులను చెల్లించేశారు. ఇవన్నీ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులే కావడం గమనార్హం. ఒకపక్క చిరు ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. మరోపక్క కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదల చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వకుండా నీరు–చెట్టు లాంటి పనులు చేసిన టీడీపీ నేతలకు బిల్లులను రవిచంద్ర చెల్లిస్తున్నారు. సీఎస్ ఆదేశాలను ధిక్కరించడం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏయే బిల్లులు చెల్లించాలో సూచిస్తూ ప్రాధాన్యతలను నిర్ధారించినప్పటికీ ఆయన ఆదేశాలను ధిక్కరించే రీతిలో రవిచంద్ర వ్యవహరించడం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ‘చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన చెప్పిన పనులన్నీ అధికారులు చేయాల్సిన పనిలేదు. కానీ రవిచంద్ర చంద్రబాబు చెప్పిన వారికల్లా బిల్లులు చెల్లించడం ఆశ్యర్యం కల్పిస్తోంది’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. గవర్నర్ నరసింహన్ డిజిగ్నేటెడ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రకటించినా సరే ఇంకా చంద్రబాబు చెప్పినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎలా పనిచేస్తారనే చర్చ సచివాలయంలో కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు రెగ్యులర్‌గా చెల్లించాల్సిన బిల్లులన్నీ పక్కనపెట్టేసి కేవలం చంద్రబాబుకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే బిల్లులనే రవిచంద్ర చెల్లింపులు చేశారు. అందుకోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి మరీ చెల్లింపులు చేయడం గమనార్హం. కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర! ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించేందుకు రూ.4,500 కోట్లు అవసరం. అయితే రవిచంద్ర ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేకుండా చేశారు. మంగళవారం నాటికి వేస్ అండ్ మీన్స్ రూ.1,500 కోట్లతోపాటు మరో రూ.500 కోట్లు ప్రత్యేక డ్రాయింగ్ నిధిని కూడా వాడేశారు. ఈ నెలలోఓపెన్ మార్కెట్లో సైతం రుణం పొందేందుకు వీలు లేకుండా ఫలితాల ముందే రుణం తీసుకున్నారు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఇందులో కనిపిస్తోందని, ఏ అధికారీ ఇంత బరితెగించి వ్యవహరించరనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్‌కి వెళ్తేగానీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్థికశాఖ వర్గాలు వాఖ్యానిస్తున్నాయి. -
కార్మికుల సొమ్ముతో వారికే జీతాలు
సాక్షి, హైదరాబాద్: కార్మికులు పొదుపు చేసుకున్న సొమ్మును వారికే జీతాల కింద ఇవ్వడం.. పైగా వారికే అప్పులు పుట్టకుండా చేయడం.. ఇదీ.. నేడు ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల పొదుపు సొమ్ముపై అవలంబిస్తోన్న తీరు. సీసీఎస్ వద్ద వడ్డీ లేని రుణాలకు అలవాటు పడిన ఆర్టీసీ యాజమాన్యం దాన్ని ఒక బంగారుబాతులా వాడుకుంటోంది. పరిధి మేరకు దాని ఫలితాలు పొందితే ఫరవాలేదు. మరింత అత్యాశకుపోతే.. సీసీఎస్ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇప్పటికే సీసీఎస్ వద్ద తీసుకున్న రుణం దాదాపు రూ.500 కోట్లకు చేరువలో ఉంది. నేపథ్యం ఏంటి? ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా పొదుపు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ‘క్రెడిట్ అండ్ కో–ఆపరేటివ్ సొసైటీ’(సీసీఎస్). ప్రతినెలా కార్మికుల వేతనం నుంచి కొంతమొత్తం మినహాయించుకుని ఈ సొమ్ముకు 10 శాతం వడ్డీతో రిటైర్మెంట్ తరువాత పొదుపు మొత్తాన్ని అందజేస్తారు. (ఇతర సొసైటీలు 6 నుంచి 7 శాతానికి మించి ఇవ్వడం లేదు). సీసీఎస్ వద్ద ఉన్న నిధులు దాదాపుగా రూ.1,500 కోట్లు. ఈ మొత్తం మధ్యతరహా బ్యాంకుల కన్నా అధికం కావడం గమనార్హం. ఇందులో కార్మికులు వేతనాల రూపంలో దాచుకున్న సొమ్మే రూ.900 కోట్లు కావడం గమనార్హం. నెలనెలా ఆర్టీసీ యాజమాన్యం రూ.40 కోట్లను కార్మికుల వేతనాల నుంచి కట్ చేసి సీసీఎస్‌కు జమచేయాలి. కానీ ఇలా ప్రతినెలా నిధుల మళ్లింపుతో బకాయిల మొత్తం రూ.380 కోట్లకు చేరింది. డిసెంబర్లో రూ.80 కోట్లు చెల్లించినా.. డిసెంబర్, జనవరి నెలలకు మరోసారి నిధులు మళ్లించడంతో అది మళ్లీ రూ.380 కోట్లకు చేరింది. ఆర్టీసీ విభజన తరువాత సీసీఎస్ నుంచి తెలంగాణ ఆర్టీసీ రూ.106 కోట్ల నిధులు అప్పుగా తీసుకుంది. దీంతో మొత్తం అప్పుల విలువ రూ.480 కోట్లు దాటడం గమనార్హం. కార్మికుల రికవరీ సొమ్ముతో వారికే జీతాలు.. కార్పొరేషన్ వద్ద సరైన నిధులు లేకపోవడంతో వారి జీతాలనుంచి కొన్నేళ్లుగా సీసీఎస్‌కు జమ చేయాల్సిన కార్మికుల ప్రీమియం డబ్బును ఆర్టీసీ యాజమాన్యం తిరిగి వారి వేతన చెల్లింపులకే మళ్లిస్తోంది. వాస్తవానికి సీసీఎస్ స్వతంత్రంగా వ్యవహరించే సహకార సంస్థ. కానీ, నిధులను ఇష్టానుసారంగా మళ్లిస్తూ సీసీఎస్ సంస్థను ఆర్టీసీ యాజమాన్యం తన జేబుసంస్థగా మార్చుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు 12 శాతం చొప్పున రూ.250 కోట్లు వడ్డీ కడుతున్న ఆర్టీసీ.. సీసీఎస్‌కు మాత్రం ఎలాంటి వడ్డీ చెల్లించడం లేదు. ఒకవేళ వడ్డీ చెల్లించాల్సి వస్తే.. 2015 నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకున్నా దాదాపు రూ.30 కోట్లకుపైగా సీసీఎస్‌కు ఆర్టీసీ కట్టాల్సి ఉండేదని సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో సీసీఎస్ మనుగడ... కార్మికులను ఆపత్కాలంలో ఆదుకునే సీసీఎస్ నిధులను మళ్లించడం అన్యాయమని, ఇలాంటి చర్యలు కార్మికుల జేబులకు చిల్లులు పెట్టడమేనని కార్మిక సంఘాల నేతలు థామస్‌రెడ్డి (టీఎంయూ), నాగేశ్వరరావు (ఎన్ఎంయూ) హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ), రాజిరెడ్డి (ఈయూ) తదితరులు విమర్శిస్తున్నారు. ఆర్థికలోటు ఇలాగే కొనసాగితే సీసీఎస్ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఆర్టీసీని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అక్షింతలు వేసినా.. వాస్తవానికి ఇదేం కొత్త వివాదం కాదు. 2015లోనూ సీసీఎస్ తన బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్పందించిన హైకోర్టు సీసీఎస్ నిధులను 60 రోజుల కంటే ఎక్కువగా వాడుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఆ సమయం దాటితే మాత్రం ఉద్యోగుల నుంచి సీసీఎస్ రికవరీ డబ్బులు మళ్లించడం నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్టీసీ విభజన తరువాత ఏపీఎస్ ఆర్టీసీ ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా 10 రోజుల్లో రికవరీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమచేస్తుండటం గమనార్హం. అధిక వడ్డీలతో నలిగిపోతున్న కార్మికులు సీసీఎస్ కార్మికులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. విద్య, వ్యక్తిగత అవసరాలు, పిల్లల వివాహం తదితర అవసరాలకు 11 శాతం చొప్పున వడ్డీతో అప్పులు ఇస్తుంది. గృహరుణాలు 8.5 శాతం తక్కువ వడ్డీకే మంజూరు చేçస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం తీరు కారణంగా సీసీఎస్ నుంచి కార్మికులకు రావాల్సిన లోన్లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో చేసేదిలేక కార్మికులు బయట అధిక వడ్డీకి రుణాలు తీసుకుని ఆర్థికంగా మరింతగా చితికిపోతున్నారు. -
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జెట్ ఎయిర్వేస్!
న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసం, వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. గత నెలలో పైలెట్లకు, ఇంజనీర్లకు, సీనియర్ మేనేజ్మెంట్కు వేతనాలు ఇవ్వడం ఆలస్యం చేసిన జెట్ ఎయిర్వేస్, తాజాగా ఇతర కేటగిరీల ఉద్యోగులకు కూడా సెప్టెంబర్ నెల వేతనాన్ని చెల్లించడం విఫలమైంది. మరోసారి వేతనాలు ఇవ్వకుండా మరింత మంది ఉద్యోగులను తీవ్ర కష్టాల్లో పడేసింది జెట్ ఎయిర్వేస్. ‘ ప్రతినెలా మాకు ఒకటవ తేదీనే జీతాలు వేస్తారు. గత నెలలో సీనియర్ మేనేజ్మెంట్, పైలెట్లు, ఇంజనీర్లను మినహాయించి, మిగిలిన ఉద్యోగులందరికీ కూడా ఆగస్టు నెల వేతనాన్ని సరియైన సమయానికే అందించారు. కానీ ఈసారి మాత్రం సెప్టెంబర్ నెల వేతనాన్ని ఇతర కేటగిరీల ఉద్యోగులకూ ఆపివేశారు. మేనేజర్, ఇతర స్థాయి ఉద్యోగులెవరికీ ఇంకా వేతనాలు అందలేదు’ అని జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ1-ఏ5, ఓ1, ఓ2 గ్రేడ్ ఉద్యోగులకు నెల వేతనం రూ.75వేల వరకు ఉంటుంది. వారికి మాత్రమే అక్టోబర్ 1న చెల్లించారు. కానీ మిగతా ఉద్యోగులు ఎం1, ఎం2, ఈ1, ఇతర గ్రేడ్ల వారికి ఇంకా వేతనాలు చెల్లించలేదు. ఈ విషయంపై జెట్ ఎయిర్వేస్ కూడా స్పందించడం లేదు. నవంబర్ వరకు వేతనాలను రెండు ఇన్స్టాల్మెంట్లలో చెల్లిస్తామంటూ ఇప్పటికే ఈ సంస్థ తన సీనియర్ ఉద్యోగులకు గోడును వెల్లబుచ్చుకుంది. ఆగస్టు నెల వేతనాన్ని కూడా అలానే చెల్లించింది. సెప్టెంబర్ 11న 50 శాతం, సెప్టెంబర్ 26న మిగతా సగాన్ని చెల్లించింది. కానీ సెప్టెంబర్ నెల వేతనాన్ని ఎలా? ఎప్పుడు? చెల్లిస్తుందో మాత్రం జెట్ ఎయిర్వేస్ చెప్పడం లేదు. ఈ ఎయిర్‌లైన్ సంస్థ గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో, ఉద్యోగులకు కూడా వేతనాలను చెల్లించలేకపోతోంది. దీంతో ఉద్యోగులు కూడా చాలా కష్టాలను పాలవాల్సి వస్తోంది. జెట్ ఎయిర్వేస్లో మొత్తం 16వేలకు పైగా ఉద్యోగులున్నారు. -
వైద్యారోగ్య శాఖలో భారీగా వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. జాతీయ ఆరోగ్య పథకం (ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం, ఎన్యూహెచ్ఎం)లో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలు, ఏఎన్ఎంలు , స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, కాంట్రాక్టు డాక్టర్లు, ఆశా వర్కర్లకు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. స్టాఫ్ నర్సు రూ.8,100, ల్యాబ్ టెక్నీషియన్ రూ.7,000, ఫార్మాసిస్టు రూ.11,000, ఏఎన్ఎం రూ.10,500, రెండో ఏఎన్ఎం రూ.8,350, మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్) రూ.5,350, మెడికల్ ఆఫీసర్ (ఆయూష్) రూ.9,532 మెడికల్ ఆఫీసర్ (ఆయూష్, ఆర్బీఎస్కే) రూ.11,900 చొప్పున వేతనాలు పెంచారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7,500 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో రెండో ఏఎన్ఎంల వేతనం రూ.21 వేలకు చేరింది. వైద్యారోగ్య శాఖలో 2000 సంవత్సరం నుంచి రెండో ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్స్, ప్రోగ్రాం ఆఫీసర్లు, అకౌంటెంట్లు, సహాయ సిబ్బంది వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమకు కనీస వేతనాలను అమలు చేయాలని వారు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరి కోరిక మేరకు వేతనాలు పెంచుతూ ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతో ప్రభుత్వంపై ఏటా రూ.92.82 కోట్ల భారం పడనుంది. తమ ఆవేదనను అర్థం చేసుకొని..వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు తమ కృతజ్ఞతలు తెలిపారు. -
అలా చేయకపోతే, ‘జెట్’ ఎగరదు
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ లిమిటెడ్, ఉద్యోగులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వేతన తగ్గింపు లాంటి వ్యయ నిర్మూలన చర్యలు తీసుకోకపోతే, 60 రోజుల అనంతరం జెట్ ఎయిర్వేస్ ఇక ఎగరకుండా.. గ్రౌండ్‌కే పరిమితం కావాల్సి వస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. రెండేళ్ల వరకు 15 శాతం వేతనం తగ్గించుకోవాలని జెట్ ఎయిర్వేస్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పైలెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. ఖర్చులను తగ్గించుకుని, రెవెన్యూలను పెంచుకుందామని జెట్ ఎయిర్వేస్ వేతన కోత విషయాన్ని పైలెట్లకు తెలిపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ వేతన కోతను జెట్ ఎయిర్వేస్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేటట్టు కనిపించడం లేదు. దీంతో జెట్ ఎయిర్వేస్ ఈ హెచ్చరికలు జారీచేసింది. సేల్స్, డిస్ట్రిబ్యూషన్, పేరోల్, మెయింటనెన్స్ వంటి ఏరియాల్లో పొదుపు చేపట్టాలని కంపెనీ చూస్తోందని, దీంతో జెట్ ఎయిర్వేస్ను ఆరోగ్యకరమైన, మరింత స్థితిస్థాపక వ్యాపారంగా మార్చుకోవాలనుకుంటున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ విషయంపై జెట్ ఎయిర్వేస్ వాటాదారులందరితో సంప్రదింపులు కూడా జరిపింది. ఈ వ్యయాలు తగ్గించుకునే క్రమంలో, జెట్ ఎయిర్వేస్ కొందరు స్టాఫ్‌ను కూడా తీసేయాలని చూస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే పైలెట్లపై లేఆఫ్స్ ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. కాగ, ఉద్యోగుల వేతనాల్లో జెట్ ఎయిర్వేస్ కోత పెడుతున్నట్టు నిన్ననే(గురువారం) రిపోర్టులు వచ్చాయి. ఆగస్టు నుంచి ఈ తగ్గింపు వేతనాలను జెట్ ఎయిర్వేస్ అమలు చేయనుందని ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఈ వేతన కోతను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పైలెట్లు అసలు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదని తెలిసింది. ఒకవేళ వేతన కోతను చేపట్టకపోతే, 60 రోజులకు మించి జెట్ ఎయిర్వేస్ను ఆపరేట్ చేయడం కుదరదని ఈ విమానయాన సంస్థ మేనేజ్మెంట్ హెచ్చరించింది. ఆర్థికంగా జెట్ ఎయిర్వేస్ చితికి పోయిందని వార్తలు వెలువడిన క్రమంలో స్టాక్ మార్కెట్లో ఈ విమానయాన సంస్థ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే 6 శాతం వరకు క్షీణించాయి. రూ.323.90 వద్ద ప్రారంభమైన దీని షేరు రూ.312.15 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్ ఎయిర్వేస్కు ఖర్చులు పెరిగిపోయాయి. వీటిని రికవరీ చేసుకునేందుకు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతోంది. 2017 జూలైలో 12 మంది జూనియర్ పైలెట్లను 30-50 శాతం వేతనాన్ని మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా పేర్కొంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి జెట్ ఎయిర్వేస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను కూడా ఆశ్రయిస్తోంది. క్యారియర్‌లోని వాటాను అమ్మిపెట్టాలని కోరుతోందని తెలుస్తోంది. -
వేతనాలు పెంచకపోగా.. కోతపెట్టిన ఎయిర్‌లైన్స్
ముంబై : ఇటీవల కాలంలో కంపెనీలు వేతనాలు పెంచకపోగా.. ఉద్యోగులకే ఎసరు పెడుతున్నాయి. వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేయడమో లేదా వేతనాల్లో కోత పెట్టడమో చేస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కూడా ఇదే బాటలో నడిచింది. తమ ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం వరకు కోత పెట్టింది. 25 శాతం వరకు తగ్గింపు వేతనాన్ని తీసుకోవాలని ఉద్యోగులను జెట్ ఎయిర్వేస్ ఆదేశించినట్టు తెలిసింది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతోందని... క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్ ఎయిర్వేస్కు ఖర్చులు పెరిగిపోయాయని ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. వీటిని రికవరీ చేసుకునేందుకు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టింది. ఆగస్టు నుంచి ఈ తగ్గింపు వేతనాలను జెట్ ఎయిర్వేస్ అమలు చేస్తుందని ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఉద్యోగులు ఎవరైతే వార్షికంగా 12 లక్షల రూపాయల వేతనాన్ని ఆర్జిస్తున్నారో, వారి వేతనాల్లో 5 శాతం కోత పడనుంది. అంతేకాక కోటికి పైగా వేతనాన్ని ఆర్జించే వారి వేతనాల్లో 25 శాతం తగ్గించేస్తోంది. అయితే ఈ వేతన కోత ఎంత కాలం పాటు కొనసాగనుందో ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం కోత పెట్టిన ఈ మొత్తాన్ని తర్వాత రీఫండ్ చేస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. వేతనాల తగ్గింపుపై జెట్ ఎయిర్వేస్ టాప్ మేనేజ్మెంట్, తమ స్టాఫ్‌తో సమావేశం ఏర్పాటు చేసింది. పైలెట్ల వేతనాలు కూడా 17 శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ వార్షిక వేతన బిల్లు రూ.3000 కోట్ల మేర ఉంటుంది. వేతనాల తగ్గింపుతో జెట్ ఎయిర్వేస్కు రూ.500 కోట్లు ఆదా కానుంది. కాగ, గత నెలలోనే జెట్ ఎయిర్వేస్, అదనంగా 75 సింగిల్-ఐసిల్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ దిగ్గజం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ రూ.60,244 కోట్ల వరకు ఉంటుంది. -
ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు!
బెంగళూరు : ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ తాయిలాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 6.2లక్షల మంది ఉద్యోగుల వేతనాలను 30 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలోనే ఆమోదం తెలుపనున్నారు. జీతాల పెంపుతోపాటు నాలుగో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. చిన్న మెలిక : జీతాల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.10,800 కోట్ల అదనపుభారం పడుతుందని, అయినాసరే పెంపునకు వెనుకాడబోమని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. అయితే, నాలుగో శనివారం సెలవుపై మాత్రం ప్రభుత్వం చిన్న మెలికపెట్టింది. నెలలో పని గంటలు తక్కువ కాకుండా ఉండేలా.. మొదటి, మూడో శనివారాల్లో ఉద్యోగులు అదనంగా పనిచేయాల్సిఉంటుంది. జనవరి 31 డెడ్‌లైన్ : జీతాల పెంపు అంశంపై గత బడ్జెట్ సెషన్లో సీఎం సిద్ధూ చెప్పిన మాట ప్రకారం.. రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస మూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేశారు. జీతాల పెంపు ఎంత శాతం ఉండాలనేదానిపై మూర్తి కమిటీ సిఫార్సు చేయనుంది. ‘‘మా నివేదిక దాదాపు పూర్తయింది. జనవరి 31 డెడ్‌లైన్ అని సీఎం చెప్పారు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో నివేదికను అందజేస్తాం’ అని శ్రీనివాసమూర్తి చెప్పారు. కాగా, ఉద్యోగ సంఘాలు మాత్రం 30 నుంచి 35 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. -
త్వరలో ఉద్యోగుల జీతాల పెంపు
భత్యాల పెంపుపై నెలాఖరులోగా కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ ఇతర భత్యాల పెంపును ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయనుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇటీవల యూనియన్ నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారని నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్(ఎన్‌జేఏసీ) కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా చెప్పారు. ఏడో వేతన సంఘం నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ హెచ్ఆర్ఏ ప్రకటించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భత్యాల పెంపుపై ఏడో వేతన సంఘం సిఫార్సుల్ని పరిశీలించిన అశోక్ లావాసా కమిటీ ఏప్రిల్ 27న నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. అనంతరం ఆ నివేదికను ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన సాధికారక కమిటీ పరిశీలించి కేబినెట్ భేటీలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఏడో వేతన సంఘం సిఫార్సుల్ని కేంద్రం గతేడాది ఆమోదించింది. -
చంద్రబాబుకు బంధువునంటూ కలెక్టర్...
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ తీరుపై టీడీపీ నేతలు, ఎస్సీ, బీసీ, కాపు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులను గౌరవించడం లేదంటూ కలెక్టర్ భాస్కర్ పై సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయనున్నారు. జిల్లాకు ఆయన రాజులా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రులకు ప్రొటోకాల్ అమలు చేయడం లేదంటూ సీఎంకు వివరించనున్నారు. చింతమనేని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు మంత్రులు పీతల సుజాత, మాణిక్యాలరావుకు ఆహ్వానం అందలేదని, మంత్రుల సమీక్షలకు కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని నేతలు ఆరోపిస్తున్నారు. చింతమనేని, తణుకు నియోజకవర్గాలకు మాత్రమే ఉపాధి హామీ పనులు ఇస్తున్నారని ఇతర ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఎంకు బంధువునంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులను లెక్క చేయడంలేదని కలెక్టర్ భాస్కర్ తీరుపై మండిపడుతున్నారు. నెల జీతాలు రెండు రోజుల పాటు ఇవ్వకుండా నిలిపేశారని, ఉద్యోగులు, ఎమ్మెల్యేల తరఫున సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయడానికి కొందరు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది. -
అమెరికాలో ఏ ఉద్యోగానికి ఎంత జీతం?
వాషింగ్టన్: అమెరికాలో ఏయే రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తారనే విషయం ఎప్పుడు ఆసక్తికరమే. గ్లాస్‌డోర్ వెబ్సైట్ తాజా అంచనాల ప్రకారం అందరికన్నా డాక్టర్లకు ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు. ఆ తర్వాత లాయర్లకు. తదనంతరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేస్తున్న వారికి ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులు వేతనాల చెల్లింపుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి నైపుణ్యాన్నిబట్టి ఎక్కువ, తక్కువ వేతనాలు ఉంటాయి. గ్లాస్‌డోర్ వెబ్సైట్ సగటు లెక్కలను మాత్రమే తీసుకొని వివిధ రంగాల్లోని ఉద్యోగాలకు చెల్లిస్తున్న వేతనాలు ఎంతో లెక్కగట్టింది. ఈ వెబ్సైట్ ఉద్యోగస్తులు తమతో షేర్ చేసుకున్న సాలరీ వివరాల ఆధారంగానే ఈ అంచనాలు వేసింది. వాటిలో టాప్ 20 స్థానాల్లో ఉన్న ఉద్యోగాలు, వాటి వేతనాల వివరాలు...... 1. ఏడాదికి ఫిజిషియన్‌కు సగటున 1.80,000 డాలర్లు 2. న్యాయవాదులకు రూ. 1.44,500 డాలర్లు 3. రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్‌కు 1.42,120 డాలర్లు 4. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్‌కు 1,32,000 డాలర్లు 5. ఫార్మసీ మేనేజర్‌కు 1,30,000 డాలర్లు 6. స్ట్రాటజీ మేనేజర్‌కు 1,30,000 డాలర్లు 7. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌కు 1,28,250 డాలర్లు 8. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైనర్ ఇంజనీర్‌కు 1,27, 500 డాలర్లు 9. ఐటీ మేనేజర్‌కు 1,23,152 డాలర్లు 10, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌కు 1.20,000 డాలర్లు 11. అప్లికేషన్ డెవలప్మెంట్ మేనేజర్ 1,20,000 డాలర్లు 12. సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌కు 1,16,920 డాలర్లు 13. ఫైనాన్స్ మేనేజర్‌కు 1,15,000 డాలర్లు 14. డేటా సైంటిస్ట్‌కు 1,15,000 డాలర్లు 15. రిస్క్ మేనేజర్ 1,15,000 డాలర్లు 16. క్రియేటివ్ డెరైక్టర్‌కు 1,15,000 డాలర్లు 17. డేటా ఆర్కిటెక్ట్‌కు 1,13,000 డాలర్లు 18. టాక్స్ మేనేజర్‌కు 1,10,000 డాలర్లు 19. ప్రాడక్ట్ మేనేజర్‌కు 1,07.000 డాలర్లు 20. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్‌కు 1,06,000 డాలర్లు. -
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేం
సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశం మేరకు దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. ఏపీ స్థానికత గల 1,252 మంది ఉద్యోగులను 4 నెలల క్రితం తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేశాయి. ఆయా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 42, ఏపీ ప్రభుత్వం 58 శాతం వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినా.. ఏపీ మాత్రం భారంగా పరిగణిస్తోంది. తెలంగాణ సంస్థల్లో పనిచేస్తున్న వారికి తామెలా జీతాలు ఇస్తామనే వాదనను సుప్రీంకు విన్నవించే యోచనలో ఉంది. ఈ విషయమై న్యాయ నిపుణులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జటిలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై రిలీవ్ అయిన ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:ఖజానాశాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఖజానా శాఖ ద్వారా చెల్లించే వివిధ చెల్లింపులను ఈ పేమెంట్ ద్వారా చెల్లించేందుకు సర్వం సిద్దం చేశారు. వచ్చే నెల నుంచి ఉద్యోగుల జీతాలు నేరుగా వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఇంతవరకు ఉద్యోగుల జీతాలు ముందుగా ట్రెజరీలో సంబంధిత అధికారులు అందజేసిన వివరాల ప్రకారం ఖజానాశాఖ అధికారులు బ్యాంకులకు ఖాతాల వారీగా జమ చేసేలా నివేదికలు అందజేసేవారు. ఇక నుంచి ఈ పేమెంట్ విధానంలో ఆ ప్రక్రియ ఉండదు. నేరుగా ఖజానా శాఖ నుంచి ఉద్యోగి బ్యాంకు ఖాతాలో వారి జీతం తదితర నగదు జమ కానుంది. ఈ పేమెంట్ విధానం అంటే ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ విధానం కార్పొరేట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా జరుగుతుంది. ఇలా ఉద్యోగుల జీతాలు చెల్లింపులు చేయడం వల్ల ఖజానా శాఖ నుంచి నేరుగా ఉద్యోగి ఖాతాలోనికి జమ అవుతుంది. బ్యాంకుకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు మిగలనున్నాయి. ఈ పేమెంట్ ద్వారా ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పదవీ విరమణ చేసిన తరువాత వారికి వచ్చే ప్రయోజనాల నగదు, ఆర్జిత సెలవులు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, టెలిఫోన్, కార్యాలయ నిర్వహణా ఖర్చులు వంటివి చెల్లింపులు జరుగుతాయి. పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, పంచాయతీల అభివృద్దికి సంబంధించిన పన్నుల బిల్లులు, పీడీ అకౌంట్‌కు సంబంధించిన బిల్లులు ఈ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరగవు. ఇవి ఎప్పటిలానే బ్యాంకుల ద్వారా చెల్లింపులు నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ నెల 2న విశాఖపట్నంలో మూడు జిల్లాలకు చెందిన సబ్ ట్రెజరీ అధికారులుగా గణాంక అధికారులతో ఈపేమెంట్పై శిక్షణలు కూడా ఉన్నతాధికారులు అందజేశారు. జిల్లా ఖజానాశాఖ కార్యాలయంతో పాటు 14 సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 30వేలకు పైనే ఉన్నారు. పెన్షన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ఈపేమెంట్ ద్వారా జీతాలు చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే జిల్లాలో నాలుగు సబ్‌ట్రెజరీల్లో డాటాఎంట్రీ ఆపరేటర్లు లేరు. ఆమదాలవలస, రణస్థలం, కొత్తూరు, కోటబొమ్మాళి ఉపఖజానా కార్యాలయాల్లో డీఏవోలు లేక సిబ్బందే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిగిలిన ఉప ఖజానాకార్యాలయాల్లో 11 మంది ఔట్సోర్సింగ్ విధానంలో డాటాఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. ఈపేమెంట్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ సిబ్బంది కొరత వేధిస్తోంది. -
అటో ఇటో తేల్చేదాకా జీతం ఇవ్వరా?
సెక్రటేరియట్ ఉద్యోగుల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తామంటూ ఆప్షన్ ఇచ్చిన తమకు ఇప్పటివరకు జూన్ నెల జీతం బ్యాంకులో జమ చేయకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వారందరూ గురువారం ధర్నాకు యత్నించడంతో ఏపీ సర్కారు సెక్రటేరియట్లో భారీగా పోలీసులను మోహరించింది. అయితే ఉద్యోగుల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ధర్నా యోచన వాయిదా వేసుకుని కార్యాలయాల దారి పట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన దాదాపు 300 మంది ఉద్యోగులు విభజన తర్వాత ఏపీ సెక్రటేరియట్లో పనిచేస్తామంటూ ఆప్షన్ ఇచ్చారు. కానీ వారికి ఇప్పటివరకు జూన్ నెల వేతనాలు అందలేదు. పిల్లలను పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించుకునే సమయంలో జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. సర్వీస్ రిజిస్టర్ ల ప్రకారం ఇంక్రిమెంట్లు కూడా వేయాల్సివుండగా అన్నిటికీ తిలోదకాలిచ్చి సహనాన్ని పరీక్షిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.