
హన్మకొండ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి కుమార్తె ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పోస్టర్ ద్వారా అభ్యర్థిస్తోంది. జిల్లాలోని కమలాపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాశ్‌రావు హన్మకొండ నయీంనగర్‌లో నివాసముంటున్నారు.
ఉపాధ్యాయురాలైన ఈయన భార్య సునీత ఫిబ్రవరి 22న మృతి చెందింది. ఈ బాధలో ఉన్న తమపై ఇప్పుడే జీతాల కోతతో మరోసారి బాధ పెట్టొద్దు కేసీఆర్ తాత అంటూ సత్యప్రకాశ్‌రావు కూతురు లాస్య ప్లకార్డు ప్రదర్శిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తోంది. (కరోనా :అపోహలూ... వాస్తవాలు)
Comments
Please login to add a commentAdd a comment