సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీ కారి్మకులకు సెప్టెంబర్ జీతాలు చెల్లించేందుకు సరిపడా డబ్బుల్లేవని హైకోర్టుకు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందని ఆ సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. సెపె్టంబర్ జీతాలు చెల్లించాలంటే రూ.239.68 కోట్లు అవసరమని, ప్రస్తుతం ఆర్టీసీ ఖాతాలో రూ.7.49 కోట్లే ఉన్నాయని వివరించారు. ఆర్టీసీ సిబ్బంది పనిచేసిన సెప్టెంబర్ నెలకు జీతాలు చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించా లని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు తో పాటు మరొకరు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి విచారించారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వమే ఆదుకుంటోంది..
ఏటా ప్రభుత్వం ఆదుకుంటేనే ఆర్టీసీ నిర్వహణ జరుగుతోందని అదనపు ఏజీ చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ కౌంటర్ పిటిషన్ ద్వారా సంస్థ ఆర్థిక స్థితిగతులను వివరించారు. వాటిని అదనపు ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘ఏటా ఆరీ్టసీకి రూ.1,200 కోట్ల మేరకు నష్టం వస్తోంది. సంస్థ రాబడిలో 58 శాతం జీతాలకే సరిపోతోంది. 2015లో ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఆరీ్టసీపై రూ.900 కోట్ల భారం పడింది. 2017లో మధ్యంతర భృతి 16 శాతం ఇవ్వడం వల్ల రూ.200 కోట్లు వార్షిక భారం పడింది. ఆర్టీసీ సొంతంగా 8,357 బస్సులు, 2,103 అద్దె బస్సులు నడుపుతోంది. వీటిని నడపటం ద్వారా ఏటా రూ.4,882 కోట్లు ఆదాయం వస్తుంటే, వ్యయం రూ.5,811 కోట్లు అవుతోంది.
సొంత రాబడి నిధులతో ప్రతి నెలా మొదటి వారంలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతోంది. దీంతో ప్రతి నెలా ప్రభుత్వ చేయూతతోనే జీతాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఆర్టీసీ అప్పు రూ.4,709 కోట్లు. ఇందులో రూ.1660 కోట్లు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ, పీఎఫ్, లీవ్ క్యాష్, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర చెల్లింపుల కోసం రూ.3,049 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం రుణాలు చేయాల్సి వచి్చంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి నష్టాలు రూ.5,269.25 కోట్లకు పేరుకున్నాయి. రోజూ టికెట్ల ద్వారా రూ.10 కోట్లు, పండుగల సమయంలో రూ.13 కోట్లు డబ్బు వస్తుంది. సిబ్బంది సమ్మె వల్ల రూ.125 కోట్లకుపైగా అదనపు నష్టం వాటిల్లుతోంది’అని పేర్కొన్నారు.
ఎంత చెప్పినా వినలేదు..
‘ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. సమ్మె చేస్తే పరిస్థితులు చక్కబడతాయని ఆశించొద్దని హితవు పలికినా ఖాతరు చేయకుండా సమ్మెలోకి వెళ్లారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించాలి’అని వాదించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. జీతాల నగదు సమాచారాన్ని ఆర్టీసీ తప్పుగా చెబుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఉన్నతాధికారుల జీతాలు రూ.100 కోట్ల వరకు చెల్లించిన యాజమాన్యం ఇంకా రూ.239 కోట్లు అవసరమని చెప్పడం వాస్తవం కాదన్నారు. సిబ్బందికి జీతాలుగా చెల్లించాల్సింది రూ.140 కోట్ల లోపేనన్నారు.
ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్నా 70 శాతానికిపైగా బస్సులు నడుపుతున్నామని మరో కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్న ప్రభుత్వం వాటి ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో హైకోర్టుకు వివరించలేదని చెప్పారు. ఎంత ఆదాయం వచ్చిందో వివరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం విచారణ 29కి వాయిదా పడింది. కాగా, ఆర్టీసీ సమ్మెపై దాఖలైన మూడు వేరు వేరు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిõÙక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రతివాదులకు నోటీసులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment