అమెరికాలో ఏ ఉద్యోగానికి ఎంత జీతం?
వాషింగ్టన్: అమెరికాలో ఏయే రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తారనే విషయం ఎప్పుడు ఆసక్తికరమే. గ్లాస్‌డోర్ వెబ్‌సైట్ తాజా అంచనాల ప్రకారం అందరికన్నా డాక్టర్లకు ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు. ఆ తర్వాత లాయర్లకు. తదనంతరం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న వారికి ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం ఉద్యోగులు వేతనాల చెల్లింపుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు.
ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి నైపుణ్యాన్నిబట్టి ఎక్కువ, తక్కువ వేతనాలు ఉంటాయి. గ్లాస్‌డోర్ వెబ్‌సైట్ సగటు లెక్కలను మాత్రమే తీసుకొని వివిధ రంగాల్లోని ఉద్యోగాలకు చెల్లిస్తున్న వేతనాలు ఎంతో లెక్కగట్టింది. ఈ వెబ్‌సైట్ ఉద్యోగస్తులు తమతో షేర్ చేసుకున్న సాలరీ వివరాల ఆధారంగానే ఈ అంచనాలు వేసింది. వాటిలో టాప్ 20 స్థానాల్లో ఉన్న ఉద్యోగాలు, వాటి వేతనాల వివరాలు......
1. ఏడాదికి ఫిజిషియన్‌కు సగటున 1.80,000 డాలర్లు
2. న్యాయవాదులకు రూ. 1.44,500 డాలర్లు
3. రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్‌కు 1.42,120 డాలర్లు
4. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌కు 1,32,000 డాలర్లు
5. ఫార్మసీ మేనేజర్‌కు 1,30,000 డాలర్లు
6. స్ట్రాటజీ మేనేజర్‌కు 1,30,000 డాలర్లు
7. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌కు 1,28,250 డాలర్లు
8. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైనర్ ఇంజనీర్‌కు 1,27, 500 డాలర్లు
9. ఐటీ మేనేజర్‌కు 1,23,152 డాలర్లు
10, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌కు 1.20,000 డాలర్లు
11. అప్లికేషన్ డెవలప్‌మెంట్ మేనేజర్ 1,20,000 డాలర్లు
12. సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌కు 1,16,920 డాలర్లు
13. ఫైనాన్స్ మేనేజర్‌కు 1,15,000 డాలర్లు
14. డేటా సైంటిస్ట్‌కు 1,15,000 డాలర్లు
15. రిస్క్ మేనేజర్ 1,15,000 డాలర్లు
16. క్రియేటివ్ డెరైక్టర్‌కు 1,15,000 డాలర్లు
17. డేటా ఆర్కిటెక్ట్‌కు 1,13,000 డాలర్లు
18. టాక్స్ మేనేజర్‌కు 1,10,000 డాలర్లు
19. ప్రాడక్ట్ మేనేజర్‌కు 1,07.000 డాలర్లు
20. ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్స్ మేనేజర్‌కు 1,06,000 డాలర్లు.