ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ తీరుపై టీడీపీ నేతలు, ఎస్సీ, బీసీ, కాపు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులను గౌరవించడం లేదంటూ కలెక్టర్ భాస్కర్ పై సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయనున్నారు. జిల్లాకు ఆయన రాజులా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రులకు ప్రొటోకాల్ అమలు చేయడం లేదంటూ సీఎంకు వివరించనున్నారు. చింతమనేని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు మంత్రులు పీతల సుజాత, మాణిక్యాలరావుకు ఆహ్వానం అందలేదని, మంత్రుల సమీక్షలకు కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని నేతలు ఆరోపిస్తున్నారు.
చింతమనేని, తణుకు నియోజకవర్గాలకు మాత్రమే ఉపాధి హామీ పనులు ఇస్తున్నారని ఇతర ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఎంకు బంధువునంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులను లెక్క చేయడంలేదని కలెక్టర్ భాస్కర్ తీరుపై మండిపడుతున్నారు. నెల జీతాలు రెండు రోజుల పాటు ఇవ్వకుండా నిలిపేశారని, ఉద్యోగులు, ఎమ్మెల్యేల తరఫున సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయడానికి కొందరు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది.
చంద్రబాబుకు బంధువునంటూ కలెక్టర్...
Published Sun, May 8 2016 10:41 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement