సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యో గుల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు న్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరించి శాశ్వత ప్రాతి పదికన నియమిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో శాఖలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం వివిధ శాఖలను ఇటీవల ఆదేశించింది. దీంతో క్రమబద్ధీకరణ నిబంధనలకు అను గుణంగా వర్క్ హిస్టరీ ఉన్న ఉద్యోగులను గుర్తించిన శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి.
రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 143 మంది కాంట్రాక్టు సూపర్‌వైజర్ల జాబితాతో తొలి ప్రతిపాదన సమర్పించగా సీఎం కార్యాలయం దాన్ని ఆమోదించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌లు, కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ నియామక ఉత్త ర్వులు జారీ చేసింది. విధుల్లో చేరిన ఆయా ఉద్యోగులకు కేడర్ ఆధారిత పే స్కేల్‌కు అనుగుణంగా వచ్చే నెల (అక్టోబర్)లో తొలి వేతనం అందనుంది.
వడివడిగా కదులుతూ: ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి విద్య, అనుబంధ శాఖల్లోనే దాదాపు 32 శాతం మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గురుకుల సొసైటీలు, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల్లోనే అత్యధిక పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ సర్వీసు నిబంధనల విష యంలో స్పష్టత కోసం ఆయా ఫైళ్లకు మోక్షం కలగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక శాఖతోపాటు సాధారణ పరిపాలన విభాగం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే మరో 30 శాతం మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొలిక్కి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరు లోగా మరికొన్ని ఫైళ్లకు ఆమోదం లభిస్తుందని విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment