* ఉద్యోగుల సంఖ్యపై మరోసారి వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వారి అసలు సంఖ్య ఎంత అని తేల్చేందుకు మరోసారి వివరాలు సేకరించాలని భావిస్తోంది. ప్రభుత్వం ఇదివరకే అనుమతించిన లేదా మంజూరు పోస్టులు ఖాళీగా ఉంటేనే కాంట్రాక్టు ఉద్యోగులను ఆ పోస్టుల్లో నియమించడానికి వీలవుతుందని, ఉద్యోగులు లేనిచోట ఇష్టానుసారం కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్న పక్షంలో వారిని పర్మనెంట్ చేయడానికి అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్దనున్న కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాకు సంబంధించి పూర్తి వివరాలు లేనందున, మరోసారి అన్ని విభాగాల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల జాబితా సేకరించాలని యోచిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తీసుకున్న సమాచారంలో పూర్తి వివరాలు రాలేదని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఈనెల 17వ తేదీన జరుగనుంది.
‘కాంట్రాక్ట్’ లెక్కెంత!
Published Thu, Sep 11 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement