గాలిలో దీపం.. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం | contract employees problems | Sakshi
Sakshi News home page

గాలిలో దీపం.. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం

Published Fri, Nov 18 2016 9:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

contract employees problems

  • బాబూ...ఎన్నికల హామీలు నెరవేర్చండి   l
  • సీఎంకి చిరుద్యోగుల మొర 
  • రాజానగరం : 
    ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల భద్రత గాలిలో దీపంలా తయారైంది. చేసే పనికి తగ్గట్టు వేతనాలు పొందలేక, ఉద్యోగ భద్రత లేక దిక్కుతోచని పక్షుల్లా అల్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు తమ కుటుంబాలను వీధిన పడేయకుండా మేలు చేయాలని వారు కోరుతున్నారు. ఓ వైపు ఉద్యోగ అర్హత వయస్సు దాటిపోతుంటే, మరోవైపు భార్య, పిల్లలతో కుటుంబ భారం కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేథప్యంలో వేరొక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే తీరిక లేక, ఉన్న ఉద్యోగాలకు గ్యారంటీ లేక చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కూలీకి ఉన్న భద్రత కూడా తమ ఉద్యోగాలకు లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు కోరుతున్నారు. 
    ఉప సంఘం వేశారు గానీ... 
    రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేస్తే ఈ చిరుద్యోగులు తమకు మేలు చేస్తారని ఆశించారు. రెండున్నరేళ్లు కావొస్తున్నా, ఈ సంఘం తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదు. వీరి ఉద్యోగాలకు భద్రత కల్పించే చర్యలు చేపట్టలేదు.   
    106,700 మంది తాత్కాలిక ఉద్యోగులు 
    రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో 56,700 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 50 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఇచ్చే జీతాలు నెలకు సగటున రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉన్నాయి. వీరు తక్కువ వేతనాలు ఎక్కువ పని భారంతో బాధపడుతున్నారు.
    విద్యాలయాల్లోనూ తాత్కాలికమే  
    ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమించి పనులు చేయించుకుంటున్న పాలకులు విద్యాలయాల్లో కూడా అదే పందాను అనుసరిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు, అడ్‌హక్‌ అధ్యాపకులు వంటి పేర్లతో తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 4,690 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, యూనివర్సిటీలలో 1650 మంది అడ్‌హక్‌ అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. 
    కోర్టు తీర్పుల నెపంతో...
    వీరి సర్వీసులను రెగ్యులరైజ్‌ చేసే విషయంలో గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులు ప్రతిబంధకంగా ఉన్నాయంటూ పాలకులు తప్పించుకుంటున్నారనే విమర్శ ఉంది. అది వాస్తవం అయితే కొత్తగా చేసే రిక్రూట్‌మెంట్‌లోనైనా మానవతా ధృక్పదంతో వీరికి కొంత ప్రత్యేక కోటా ఇవ్వాలంటూ కోర్టు చేసిన సూచనను పట్టించుకుంటున్నారా? అంటే అదీ లేదు. ఇక నుంచైనా ఇటువంటి నియామకాలకు స్వస్తి పలుకుతున్నారా? అంటే అదీ జరగడం లేదు. ఇప్పటికీ విద్యాలయాల్లో అధ్యాపకులను సైతం రకరకాల పేర్లతో తాత్కాలిక పద్ధతిలోనే తీసుకుంటున్నారు.  
    అటకెక్కిన నిరుద్యోగ భృతి 
    రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తరువాత ఆ మాటలను మరిచారు. ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.  
     
    ఆందోళనలు చేపట్టే పరిస్థితులు వద్దు  
    ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల్లో ఎక్కువగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేకుండా ఉంది. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇందుకోసం ఆందోళనలు చేపట్టే పరిస్థితులను తీసుకురావొద్దు. 
    – డాక్టర్‌ కనకరాజు, తెలుగు అధ్యాపకులు, గోకవరం
    ఉద్యోగ భద్రత లేదు
    సంవత్సరాల తరబడి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న మా  ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయడం లేదు. దీంతో ఉద్యోగ భద్రత కరువై ఏరోజు ఏవిధమైన ఆదేశాలు వస్తాయోననే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవితాలను నెట్టుకొస్తున్నాం. 
    – టి. అమర్‌కల్యాణ్, కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేష¯ŒS ప్రతినిధి
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement