
సాక్షి, చిత్తూరు : ప్రజాసంక్పలయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కలిశారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించడమే కాకుండా, రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా వేతనాలు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రమాదవశాత్తూ, విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, విద్యుత్ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ విధానాలకు స్వస్తి పలికాలని వారు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వీరి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ వీటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా పాదయాత్రలో భాగంగా అడ్డగింటవారిపల్లి చేరుకున్న వైఎస్ జగన్‌కు గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.