తెలంగాణ 2వ ఎఎన్‌ఎంలు బిక్షాటన చేస్తున్న దృశ్యం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తెలంగాణ కాంట్రాక్టు 2వ ఏఎన్‌ఎంల ఆధ్వర్యంలో బిక్షాటన చేశారు. రాష్ట్రంలో 4వేల మంది 2వ ఎఎన్‌ఎంలు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కూడ ఇక మా బతుకులు బిక్షపు బతుకులుగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆర్.వాణి, కుమార్, కిరణ్‌మయి, మమత, రజిత, సమత, సబిత తదితరులు పాల్గొన్నారు.