సిద్దిపేట : రెండో ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏఎన్ఎంలు వినూత్న నిరసన తెలిపారు. స్థానిక క్లస్టర్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు సరస్వతీ, రజిత, నాగమణి, విజయ, రేణుక, యాదమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.