– టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
సర్వేపల్లి(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): తాము చేపట్టిన ఉద్యమాల ఫలితంగా 24 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం పర్మినెంట్ చేసిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు ఏపీజెన్‌కో ప్రాజెక్టులో బీసీ విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే–సావిత్రీ బాయి ఫూలే విగ్రహాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం కూడా తీసుకోవాలన్నారు. వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఉద్యమం చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. జెన్‌కో డైరెక్టర్లు అప్పారావు, సుందర్‌సింగ్, సీఈలు, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
‘ఉద్యమాల వల్లే పర్మనెంట్ అయ్యారు’
Published Fri, May 5 2017 8:24 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
Advertisement