తెయూ(డిచ్‌పల్లి): కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీ బాలుర వసతి గృహం వద్ద సోమవారం జేఏసీ నాయకులు తమ మెడలకు తాళ్లతో ఉరి బిగించుకుని వినూత్న నిరసన తెలిపారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాల పేరిట నిరుద్యోగ విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనం, వెయిటేజీ ఇస్తే నిరుద్యోగ విద్యార్థులకు ఇబ్బం ది లేదని, కానీ వారిని రెగ్యులరైజ్ చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి తన పదవికి రాజీనా మా చేసి విద్యార్థులను విమర్శిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు రాజ్‌కుమార్, చైర్మన్ సంతోశ్‌గౌడ్, బాలాజీ, సంతోశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
‘కాంట్రాక్టు’ను రెగ్యులరైజ్ చేయొద్దు
Published Tue, Sep 23 2014 3:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement