మోర్తాడ్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులు సంబురపడ్డారు. ఇప్పుడు కాంట్రాక్టుల ముగింపు తేదీ దగ్గరకు వస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. వీరి కాంట్రాక్టును పొడిగించడమా.. క్రమబద్దీకరించడమా.. అనే విషయాన్ని ఇంకా తేల్చలేదు.
పన్నెండేళ్లుగా
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పడకల ఆ స్పత్రుల్లో ఎంపీహెచ్‌ఏ, ఏఎన్‌ఎం, ఫార్మసిస్టు, ల్యాబ్ అసిస్టెంట్, స్టాఫ్ నర్సులుగా 362 మంది కాంట్రాక్టు ప ద్ధతిన పని చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్లుగా విధులు ని ర్వర్తిస్తున్నా గత ప్రభుత్వాల తీరుతో వీరి జీవితాలు ఇంకా గాడిలో పడలేదు. దివంగత ముఖ్యమంత్రి రా జశేఖరరెడ్డి కాంట్రాక్టు వైద్య ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హమీ ఇచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించే లోపే ఆయన ప్రమాదవశాత్తు మృతిచెందడంతో వైద్య ఉద్యోగుల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఎన్నికల పుణ్యమా అని వివిధ రాజకీయ పార్టీలు కాంట్రాక్టు ఉద్యోగులపై వరాలు గుప్పించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.
మార్చితోనే ముగింపు
కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల ఒప్పందం మార్చితోనే ముగిసింది. వీరి సేవలు అత్యవసరం కావడంతో గవర్నర్ నరసింహాన్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వారి ని కొనసాగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వరకు ఉద్యోగుల కాంట్రాక్టు పొడిగించారు. ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా తుది నిర్ణయానికి సమయం పడుతుంది.
అంతలోపే ఉద్యోగుల కాంట్రాక్టు ముగిసిపోనుండటంతో వారు తమ ఉద్యోగం ఉంటుందో.. ఊ డుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 235మంది ఏఎన్‌ఎంలు, 72మంది ఎంపీహెచ్‌ఏలు, ముగ్గురు ఫార్మసిస్టులు, ఐదుగురు ల్యాబ్‌అసిస్టెంట్లు, 47మంది స్టాఫ్‌నర్సులు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని రెగ్యులరైజ్ చేయాలని వారు కోరుతున్నారు.
ఎన్నికల హమీని నిలబెట్టుకోవాలి
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వైద్య సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగులతోపాటు వారి కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయి. ఈ నెలాఖరుతో కాంట్రాక్టు ముగిసిపోనున్న దృష్ట్యా వీలైనంతా తొందరగా నిర్ణయం తీసుకోవాలి.
- అశోక్, పారామెడికల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉంటుందా.. ఊడుతుందా..?
Published Thu, Jun 19 2014 3:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement