చెవులు పిండి ఉద్యోగ భద్రత సాధిస్తాం...
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు
వరంగల్ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకుంటే అధికార పార్టీ చెవులు పిండి సాధిస్తామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరారుు. ఈ సందర్భం గా ఎర్రబెల్లి దయూకర్‌రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల ను విస్మరించడంలో సీఎం కేసీఆర్ ఘనుడు అని ఆరోపించారు. మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా టమార్చడం సిగ్గుచేటన్నారు.
సీఎం కేసీఆర్.. పూటకో మాట చెబుతున్నాడే తప్పా... హామీల ను అమలు చేయడంపై దృష్టి పెడ్టడంలేదని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులపై తీసుకొచ్చి న కొత్త జీవోలో ఇళ్లు, కారు, ట్రాక్టర్ ఉన్న వారికి ఆహార భద్రత కార్డులు ఇవ్వదన్న నిబంధనలు పేర్కొన్నారని, అరుుతే వాటిపై తాను అసెంబ్లీ లో నిలదీయడంతో జీవో రద్దయ్యిందన్నారు. అవుట్ సోర్సింగ్‌తో జీతాలు లేకుండా పూర్తిగా పర్మనెంట్ చేసేంత వరకు ఉద్యమాలు చేయూలని సూచించారు. టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షు డు అనిశెట్టి మురళీమనోహర్ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పేరిట చేపట్టిన మిషన్ కాకతీయ.. కమీషన్ కాకతీ యగా మారిందని ఆరోపించారు. టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న హామీ లు ప్రకటనలుగా మిగిలి పోతున్నాయన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నాయకుడు నవీన్ మాట్లాడుతూ తమకు వేతనాలు సంస్థ ద్వారానే నేరుగా ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రచార కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమా ర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు సాంబయ్యనాయక్, సంతోష్‌నాయక్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, వెంకట్, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.