
శ్రీకాళహస్తిలో నిలిచిన పూజలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి, వాయులింగేశ్వర స్వామి దేవాలయంలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. శనివారం ఆలయంలో పువ్వులు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాహుకేతు పూజలతోపాటు ఆలయంలో పూజలు కూడా ఆగిపోయాయి. అయితే శనివారం కావడంతో శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. పూజలు నిలిచిపోవడంతో భక్తులు ఆలయం వెలుపలకు బారులు తీరారు. పూజల కోసం పువ్వుల తీసుకువచ్చేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.