
సాక్షి, శ్రీకాళహస్తి(తిరుపతి): శ్రీకాళహస్తీశ్వరాలయానికి బ్రెజిల్ దేశస్తులు 22 మంది యువతీ, యువకులు సోమవారం విచ్చేశారు. రూ.500 టికెట్ తీసుకుని రాహుకేతు పూజలు చేయించుకున్నారు.
గతంలో తమ దేశానికి చెందిన వారు ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకున్నారని, వారికి మంచి జరగడంతోనే తాము వచ్చామని తెలిపారు. ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు.