సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం రేపిన కొత్త విగ్రహాల ప్రతిష్ఠ ఘటన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకు చెందిన సుధాకర్, తిరుమలయ్య,సూలవర్థన్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి మీడియాకు మంగళవారం వెల్లడించారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆలయంలో విగ్రహాలు పెట్టారని, సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించామని తెలిపారు. అన్ని ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. దోష నివారణ కోసం విగ్రహాలు ప్రతిష్టించినట్లుగా విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ నెల 2న విగ్రహాలు చేయించి, 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. సీసీ టీవీ విజువల్స్, ద్విచక్రవాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్‌లు సీజ్ చేసినట్లు రమేష్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment