Statues case
-
వెండి సింహాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, విజయవాడ: దుర్గ గుడిలో మూడు వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు సాయిబాబాతో పాటు బంగారం వ్యాపారి కమలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. గత సంవత్సరం సెఫ్టెంబర్ 17న దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల వెండి రథంలోని నాలుగు వెండి సింహాల్లో మూడు సింహాలు మాయమైనట్లు ఫిర్యాదు అందిందని, కానీ జులైలో దొంగతనం జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి150 మందిని విచారించామని, ఈ కేసులో ప్రధాన నిందితుడు భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయిబాబాగా నిర్థారించామని సీపీ పేర్కొన్నారు. గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాలలోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు సాయిబాబా.. 2012లో చివరిసారిగా పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడని సీపీ వెల్లడించారు. సాయితో పాటు బంగారం వ్యాపారి ముత్తా కమలేష్‌ను కూడా అరెస్టు చేశామని, చోరికి గురైన మొత్తం వెండితో పాటు మిగతా ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 6.4 కేజీల వెండిని రికవరి చేశామని సీపీ తెలిపారు. 59 వేల దేవాలయాలు జియో ట్యాగింగ్.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రత పెంచామని సిట్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. 59 వేల దేవాయాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు, 45 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని చర్యలు చేపట్టినప్పటికి కొంతమంది దురుద్దేశ్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి పై చర్యలు తీసుకుంటామని డీఐజీ వెల్లడించారు. -
విగ్రహాల ప్రతిష్ఠ కేసు: ముగ్గురి అరెస్ట్
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం రేపిన కొత్త విగ్రహాల ప్రతిష్ఠ ఘటన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకు చెందిన సుధాకర్, తిరుమలయ్య,సూలవర్థన్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి మీడియాకు మంగళవారం వెల్లడించారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆలయంలో విగ్రహాలు పెట్టారని, సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించామని తెలిపారు. అన్ని ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. దోష నివారణ కోసం విగ్రహాలు ప్రతిష్టించినట్లుగా విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ నెల 2న విగ్రహాలు చేయించి, 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. సీసీ టీవీ విజువల్స్, ద్విచక్రవాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు రమేష్‌రెడ్డి తెలిపారు. -
మాయావతికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
‘అర్ధరాత్రి’ విగ్రహాలపై హైకోర్టు నోటీసులు
విశాఖసిటీ: ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బీచ్ రోడ్డులో రాత్రికి రాత్రి విగ్రహాలు ఏర్పాటు చేయడం.. ఆపై వాటిని ఆవిష్కరించడంపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతేడాది నవంబర్ 30వ తేదీన రాత్రికి రాత్రే దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాల్ని ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే విగ్రహాలు ఏర్పాటు చెయ్యడంపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యులకు వెంటనే నోటీసులు జారీ చెయ్యాలని జోన్–2 అధికారులను ఆదేశించారు. దీంతో డిసెంబర్ 1వ తేదీన జోన్–2 కమిషనర్ నల్లనయ్య విగ్రహాలు ఏర్పాటు చేసి వారికి నోటీసులు జారీ చేశారు. రెండు నెలలు గడుస్తున్నా వాటిని తొలగించలేదు. అయితే దీనిపై బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత పిల్ నం.19/2019ను హైకోర్టు శుక్రవారం స్వీకరించింది. పిల్‌ను పూర్తిగా పరిశీలించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీతో పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జోన్–2 కమిషనర్ నల్లనయ్య, అక్కినేని కళాసాగర్ అధ్యక్షుడు పొన్నాడ మోహనరావుకి నోటీసులు జారీ చేసింది. వీరిని ప్రతివాదులుగా చేర్చుతూ వాదనలు వినిపించేందుకు రెండు వారాల గడువు విధించింది. వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది.దీనిపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసేందుకు 2017 ఆగస్ట్‌లో యునైటెడ్ దళిత్ ఫ్రంట్ దరఖాస్తు చేసుకుంటే.. ఇంత వరకూ పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. కానీ ఇలా రాత్రికి రాత్రే మూడు విగ్రహాలు పెట్టినా కలెక్టర్, కమిషనర్ ఏమీ చెయ్యకుండా విడిచిపెట్టడాన్ని సహించలేకే పిల్ వేశానని తెలిపారు. విగ్రహాలు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదనీ, నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఏర్పాటు చెయ్యడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. -
విగ్రహాల దొంగల విచారణ
జగిత్యాలక్రైం: పంచలోహ విగ్రహాల దొంగలను జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసులు శని వారం అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్, తాటిపల్లి, ధరూర్‌కు చెందిన ముగ్గురు యువకులు కలిసి కోరుట్లలోని పలు ఆలయాల్లో ఐదు పంచలోహ విగ్రహాలను దొంగిలించారు. వాటిని గాంధీనగర్‌లో దాచిపెట్టారు. విగ్రహాలను శనివారం భూమిలో పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాలు ఏ ఆలయాలకు చెందినవనే కోణంలో విచారణ చేస్తున్నారు. -
విగ్రహాల దొంగల విచారణ
జగిత్యాలక్రైం: పంచలోహ విగ్రహాల దొంగలను జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసులు శని వారం అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్, తాటిపల్లి, ధరూర్‌కు చెందిన ముగ్గురు యువకులు కలిసి కోరుట్లలోని పలు ఆలయాల్లో ఐదు పంచలోహ విగ్రహాలను దొంగిలించారు. వాటిని గాంధీనగర్‌లో దాచిపెట్టారు. విగ్రహాలను శనివారం భూమిలో పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాలు ఏ ఆలయాలకు చెందినవనే కోణంలో విచారణ చేస్తున్నారు. -
పోలీసు దొంగ..!
- విగ్రహాల కేసులో ఓ ఇంటెలిజెన్స్ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్న పొలీసులు - ఇంట్లోనే విగ్రహాలు అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వైనం - పోలీసుల అదుపులో మరో నలుగురు విగ్రహాల దొంగలు కదిరి: ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుంటే అదుపు చేయాల్సిన పోలీసే పలు విగ్రహాల చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయాల్లో చోరీ చేసిన విగ్రహాలను ఆ పోలీస్ తన ఇంట్లో అమ్ముతూ రెండురోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడైనా మతపరమైన శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందనే సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ దృష్టికి చేరవేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇందులో పనిచేసే పోలీసులు సివిల్ డ్రెస్‌లోనే ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతుంటారు. ఈ విభాగంలో పని చేసే ఓ పోలీస్ జిల్లా కేంద్రంలోని కొవ్వూరు నగర్లో కాపురముంటున్నారు. ఇటీవల కాలంలో పలు ఆలయాల్లో విలువైన విగ్రహాల చోరీ అయ్యాయి. దీన్ని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు సీరియస్‌గా తీసుకున్నా రు. దీని వెనుక ఎంతటి వ్యక్తులున్నా సరే వదిలిపెట్టకండని అన్ని పోలీస్ సబ్ డివిజన్లలో పనిచేసే డీఎస్పీలను ఆదేశించారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా సంచరించి ఇద్దరు విగ్రహాల దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తే కౌంటర్ ఇంటెలిజె న్సీలో పని చేసే ఆ పోలీస్ పేరు వారు చెప్పారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయం వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పోలీస్‌పై నిఘా ఉంచారు. రెండు రోజుల క్రితం ఆ పోలీస్ తన ఇంట్లో ఎంతో విలువైన సీతారామలక్ష్మణులతో పాటు ఆంజనేయుడి విగ్రహాలను అమ్ముతుంటే సీసీఎస్ పోలీ సులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తే తనకెలాంటి సంబంధం లేదని, తన బంధువులు ఒకరిద్దరు విగ్రహాల చోరీలలో సిద్ధహస్తులని, వారు తీసుకొచ్చిన విగ్రహాలు తన ఇంట్లో దాచి విక్రయించేవారని చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన దగ్గర విగ్రహాల చోరీలకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రాయచోటి రోడ్డులో ఓ బావిలో కూడా కొన్ని విగ్రహాలు దాచారని, వాటికోసం నేడో, రేపో సీసీఎస్ పోలీసులు కదిరికి రానున్నారని విశ్వసనీయ సమాచారం. సీసీఎస్ పోలీ సులు అదుపులోకి తీసుకున్న ఆ కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీస్ ఇటీవల పలు మార్లు కదిరిలో సంచరించారు. అదే సమయంలోనే మరకత మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఆ కేసులో కూడా ఇతని హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.